ఎగ్జిట్ పోల్స్ బాయ్ కాట్ – కాంగ్రెస్ ను ఉతికారేసిన అమిత్ షా

కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా కార్నల్ అయిపోతోంది. యుద్ధం పూర్తి కాకముందే అస్త్ర సన్యాసం చేసేస్తోంది. నిజానికి యుద్ధం ప్రారంభంలోనే కాంగ్రెస్ చేతులెత్తేసిందనుకోండి. ఓటమి భయంతో పారిపోతున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త నాటకానికి తెర తీసింది. ఎగ్జిట్ పోల్స్ పై కొత్త ఆరోపణలు చేసింది….

ఆశ్చర్య పరిచిన పవన్ ఖేరా స్టేట్ మెంట్..

కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి పవన్ ఖేరా ఎక్స్ లో ఒక స్టేట్ మెంట్ పోస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఎగ్జిట్ పోల్స్ మీద విశ్వాసం లేదన్నట్లుగా ఆయన మాట్లాడారు. ఈ సాయంత్రం ఆరున్నరకు వెలువడే ఎగ్జిట్ పోల్స్ ను తమ పార్టీ బాయ్ కాట్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఓటింగ్ ముగిసిన తర్వాత స్పెక్యులేషన్ వల్ల ప్రయోజనం లేదని పవన్ ఖేరా విశ్లేషించారు. అందుకే ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించిన డిబేట్స్ లో కాంగ్రెస్ పార్టీ పాల్గొనబోదని ఆయన అన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన జూన్ 4 తర్వాత అన్ని చర్చల్లో పాల్గొంటామన్నారు. తినబోయే ముందు రుచి చూడటం ఎందుకన్నట్లుగా ఆయన మెట్టవేదాంతం వల్లెవేశారు.

కాంగ్రెస్ పారిపోయిందన్న హోం మంత్రి

కాంగ్రెస్ పార్టీ ఓటమిని అంగీకరించిందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న విశ్లేషణ. అందుకే మీడియా ముందుకు వచ్చేందుకు భయపడుతోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. అలా పారిపోవద్దని, ఓటమిని విశ్లేషించుకోవాలని ఆయన సూచిస్తున్నారు. ఫలితాలు తమకు అనుకూలంగా రానప్పుడు దూరం జరగడం కాంగ్రెస్ కు అలవాటేనని బీజేపీ నేతలు అంటున్నారు. ఇదీ ఒక హిపోక్రసీ లాంటిదన్నారు. అందుకే ఏడో దశలో ఓటేసే వాళ్లంతా కాంగ్రెస్ వైపు చూసి తమ ఓటును వృధా చేసుకోవద్దని అన్నారు. కాంగ్రెస్ వల్ల దేశానికి కలిగే ప్రయోజనం కూడా ఏమీ లేదన్నారు…

కాంగ్రెస్ పార్టీవి పిల్లచేష్టలంటున్న నడ్డా…

ఆడుకునే బొమ్మను పోగొట్టుకున్న చిన్నపిల్లాడు ఎలా ఏడుస్తాడు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు అలానే ఏడుస్తోందట. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు ఇవి. దేశంలో అతి పెద్ద విపక్ష పార్టీ అయినప్పుడు పూర్తి పరిణితితో వ్యవహరించాల్సిన కాంగ్రెస్ పార్టీ తన బాధ్యత నుంచి దూరం జరుగుతోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పని అయిపోయిందనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏమీ కావాలని ఆయన ప్రశ్నించారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పని అయిపోతుందని నడ్డా జోస్యం చెప్పారు…