రాహుల్ గాంధీ వర్సెస్ స్మృతీ ఇరానీ.. 2019 ఎన్నికల సీన్ రిపీటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓ సారి మట్టి కరిచినా మళ్లీ రాహుల్ అమేఠీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు.కేంద్ర మంత్రి ఇరానీ కూడా రాహుల్ ను మరో సారి ఓడిచేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కేరళలోని వాయినాడ్ ఎంపీగా ఉన్న రాహుల్ .. యూపీలో తమ కుటుంబ ప్రాబల్యం తగ్గలేదని నిరూపించుకోవాలని తపన పడుతున్నారు. యూపీసీసీ అధ్యక్షుడు అజయి రాయ్ ప్రకటన వారణిసిలో ప్రధాని మోదీపై పోటీ చేసి ఓడిపోయిన అజయ్ రాయ్ ని ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (యూపీసీసీ) అధ్యక్షుడిగా నియమించారు. బాధ్యతలు చేపట్టిందే తడవుగా ఆయన అమేఠీపై దృష్టి పెట్టారు. ఈ సారి స్మృతీ ఇరానీని ఓడించి తీరుతామని అందుకోసం రాహుల్ గాంధీని రంగంలోకి దించుతామని అజయ్ రాయ్ ప్రకటించారు. గత ఫలితాలు వేరు ఇప్పటి వరిస్థితులు వేరని ఆయన విశ్లేషించారు. సోనియా కుటుంబానికి ఇంత కాలం కంచుకోటగా ఉన్న అమేఠీ నియోజకవర్గంలో గత సారి స్మృతీ ఇరానీ విజయం సాధించడానికి చాలా కారణాలే ఉన్నాయి. 2014లో ఓడిపోయిన తర్వాత స్మృతీ ఇరానీ.. అమేఠీపై ప్రత్యేక దృష్టి పెట్టి పనులు చేశారు. అది తన నియోజకవర్గమన్న ఆలోచనతో ఆమె పనిచేశారు. ప్రజా వ్యతిరేక, తొంగి చూడని రాహుల్ అమేఠీలో గెలవడమేగానీ నియోజకవర్గానికి సోనియా కుటుంబం చేసిందేమీ లేదని చాలా రోజులుగా ఓటర్లలో అసంతృప్తి ఉంది. ముఖ్యంగా మహిళ ఓటర్లు కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉండేవారు. కనీస వసతులు, మౌలిక సదుపాయాల కల్పనలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందన్న ఆగ్రహమూ, అసంతృప్తి వారిలో ఉండేది. అందుకే 2019లో మొహమాటపడకుండా వాళ్లు రాహుల్ ని ఓడించారు. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరి మారలేదు. 2019 నుంచి ఇప్పటి వరకు రాహుల్ గాంధీ… అమేఠీలో కేవలం రెండు పర్యాయాలు పర్యటించారు. అదీ కూడా మొక్కుబడి పర్యటనే తప్ప జనం బాధలు అర్థం చేసుకుందామన్న ఆకాంక్ష ఆయనలో కనిపించలేదు. ఫ్లయింగ్ కిస్ తో అభాసుపాలై… రాహుల్ గాంధీ ఇటీవలి కాలంలో అవాంచనీయ చర్యలకు సైతం దిగుతున్నారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా కేంద్ర మంత్రిగా ఉన్న మహిళా సభ్యురాలు స్మృతీ ఇరానీకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి రాజకీయ సంస్కృతికే ఆయన తిలోదికాలిచ్చారు. లోక్ సభ నుంచి బయటకు వెళ్తూ ఆయన ఈ పనిచేశారు. రాహుల్ చేష్టలపై స్మృతీ ఇరానీ సహా బీజేపీ మహిళా ఎంపీలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఆయన పరిశీలనలో ఉంది. వాయినాడ్ పోటీ ఖాయం.. అమేఠీ బరిలో రాహుల్ ఉంటారని కాంగ్రెస్ పార్టీ మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నప్పటికీ రెండో చోట పోటీ చేయకుండా ఉండలేని పరిస్థితి. కేరళలోని వాయినాడ్ నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా రెండో సారి పోటీ చేయాలనుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చూసుకుంటున్నారు. గత సారి లాగే అమేఠీ నుంచి ఓడిపోయినా వాయినాడ్ చేతిలో ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ఆశ. అప్పుడు ఎంపీ క్వార్టర్ ఖాళీ చేసే అవకాశం ఉండదు మరి..
Related Posts
2024 ఎన్నికల్లో గెలిచిన సినీ సెలబ్రెటీలు వీళ్లే – ప్రతి ఒక్కరి విజయం ప్రత్యేకమే!
గతంలో ఎన్నడూ లేనతంగా దేశ చరిత్రలో 2014 ఎన్నికలు హాట్ టాపిక్ అయ్యాయి. ముఖ్యంగా ఈ సారి ఎన్నికల్లో సినీ సెలెబ్రెటీలు చాలామంది టాప్ కంటిస్టెంట్స్ గా…
మోదీ ఆశీస్సులు, ప్రజల దీవెనలతో సురేష్ గోపీ విజయం
కేరళలో బీజేపీ తొలి సారి ఖాతా తెరిచింది. ఆ పార్టీ అభ్యర్థి, నటుడు సురేష్ గోపీ విజయం సాధించారు. దక్షిణ కేరళలోనే త్రిశూర్ లోక్ సభా నియోజకవర్గం…
నూతన ఉత్సాహం, నూతన దృఢనిశ్చయం – అదే మోదీ తత్వం…
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వరుసగా మూడో సారి కొలువుదీరబోతోంది. కేంద్రంలో ప్రజలకు మేలు చేసే ఏకైక సర్కారుగా పేరు సంపాదించబోతోంది. ఇటీవల జరిగిన లోక్ సభ…