మోదీ ప్రజాపాలనకు అమెరికా ప్రశంసలు

అమెరికా ఓ అగ్రరాజ్యం. ప్రజాస్వామ్య దేశం. ఆశయ సాధనకు కృషి చేసే వారికి స్వర్గధామం. అమెరికా ఆలోచించి వాస్తవ దృక్పధంతో ప్రకటనలు చేస్తుందన్న విశ్వాసమూ ఉంది. పైగా ఏ అంశానికైనా భారతీయులు, అమెరికా వైపే చూస్తారు. పైగా అన్ని రంగాల్లో అమెరికాకు స్పీడ్ ఎక్కువ. అమెరికాతో స్నేహం ఓ అడ్వాంటేజ్ కూడా అని చెప్పాలి. అలాంటి అమెరికా కొన్ని సందర్భాల్లో దిశానిర్దేశం కోసం భారత్ వైపు చూస్తోంది. ప్రధాని మోదీ నాయకత్వంలోని భారత్ దేశ వ్యవస్థల పట్ల అమెరికాకు అత్యంత విశ్వాసం ఉంది.

భారత ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టిన అమెరికా

మేకిన్ ఇండియా సహా అనేక పథకాల ద్వారా భారత్ వెలిగిపోతున్నప్పటికీ మోదీ నాయకత్వాన్ని, దేశాన్ని కించపరచమే ధ్యేయంగా విపక్షాలు అహర్నిశలు ఆరోపణలు సంధిస్తున్నాయి. దేశం అసలు ఒక అడుగు కూడా ముందుకు సాగడం లేదని విమర్శిస్తున్నాయి. రాహుల్ గాంధీ అమెరికా వెళ్లి మరీ దేశంపై బురదజల్లారు. విషం చిమ్మారు.

రాహుల్ గాంధీ లాంటి తిరోగమన రాజకీయాలు చేసే వారికి అమెరికా చేసిన ఓ ప్రకటన గుణపాఠంగా పరిణమించే అవకాశం ఉంది. అన్ని రంగాల్లో భారత్ – అమెరికా సహ భాగస్వాములను వైట్ హౌస్ అధికారి ఒకరు చెప్పారు. భారత్ శక్తిమంతమైన ప్రజాస్వామ్యదేశమని నమ్మకం లేని వాళ్లు న్యూఢిల్లీ వెళ్లి చూసుకోవచ్చని ఆ అధికారి సవాలు చేయడం మోదీ నాయకత్వంపై అమెరికాకు ఉన్న నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తుంది. ప్రజాస్వామ్య సంస్థలు, వ్యవస్థలను బలోపేతం చేయడంలో ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని అమెరికా జాతీయ భద్రతా మండలికి చెందిన వ్యూహాత్మక భాగస్వామ్యాల సమన్వయకర్త జాన్ కిర్బీ ఆన్నారు. భారత్ తో స్నేహం వల్ల అమెరికా ప్రజాస్వామ్యం కూడా పరిఢవిల్లుతుందని ఆయన చెప్పుకున్నారు.

జూన్ 21 నుంచి మోదీ అమెరికా పర్యటన

ప్రధాని మోదీ ఈ నెల 21 నుంచి మూడు రోజుల పాటు అమెరికాలో అధికారిక పర్యటన జరుపుతున్నారు. అనేక ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చిస్తారు. గత పర్యటనలకు, ప్రస్తుత టూర్ కు చాలా తేడా ఉంది. 2014 నుంచి మోదీ నాలుగు పర్యాయాలు అమెరికా వెళ్లివచ్చారు. వాటన్నింటినీ వర్కింగ్ విజిట్స్ అని పిలిచారు.అక్కడ ర్యాలీలు, ప్రవాస భారతీయుల మీటింగులు, ఐక్యరాజ్య సమితి సభల్లో పాల్గొని వచ్చారు. ఈ సారి మాత్రం ఆయన పూర్తి స్థాయిలో అధికారిక పర్యటనకు వెళ్తున్నారు.

అమెరికా ఆహ్వానం మేరకే..

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు ఓ దేశాధినేతగా మోదీ అక్కడకు వెళ్తున్నారు. ఈ సారి అన్ని అధికారికంగా మోదీకి స్వాగతం లభిస్తుంది. ఈ క్రమంలో అనేక లాంఛనాలు నిర్వహిస్తారు. ఈ సారి రక్షణ రంగంలో కీలక ఒప్పందాలు జరుగుతాయని అమెరికా రక్షణమంత్రి లాయిడ్ ఆస్టిన్ ప్రకటించారు. భారత – పసిఫిక్ దేశాల భద్రత విషయంలో క్వాడ్ పాత్రపై కూడా చర్చిస్తారు.మోదీ పర్యటన సందర్భంగా భారత్ తమకు కీలక భాగస్వామి అని అమెరికా మరోమారు ప్రకటించింది. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని చెప్పింది. అమెరికాకు తెలిసి విషయం భారత విపక్షాలకు కూడా అర్థమైతే బావుంటుందేమో….