ఇవన్నీ వెయ్యికోట్లు టార్గెట్ పెట్టుకున్న మూవీసే!

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లో అడుగుపెట్టాం. అప్పటి నుంచి సౌత్ సినిమాల క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.పైగా KGF, కాంతారా, విక్రమ్ లాంటి మూవీస్ నార్త్ ఇండస్ట్రీని మనవైపు చూసేలా చేశాయ్. పైగా గత కొన్నేళ్లుగా కేవలం షారుక్ మూవీస్ తప్ప బాలీవుడ్ లో సరైన హిట్ ఒక్కటీ లేదు. అందుకే సౌత్ డైరెక్టర్స్ తో మూవీస్ తీసేందుక ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు కూడా సెట్స్ పై ఉన్న సౌత్ మూవీస్ ఆశలన్నీ వెయ్యికోట్లపై ఉన్నాయ్…

కల్కి 2898ఏడీ
సలార్ కి పోటీగా డంకీ, ఆక్వామెన్ లాంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ వాటి పోటీని తట్టుకుని సలార్ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 750 కోట్లు కలెక్ట్ చేసింది. డివైడ్ టాక్ వస్తేనే ఈ కలెక్షన్లు వచ్చాయంటే హిట్ టాక్ వస్తే లెక్క పక్కాగా వెయ్యికి చేరేది. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తోన్న కల్కి 2898ఏడీ పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా క్లిక్ అయితే బాహుబలి 2 కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందనే అంచనాలున్నాయి.

పుష్ప 2
ఎలాంటి బ్రాండ్ ఇమేజ్ లేకుండా పాన్ ఇండియా హీరోగా ఎదిగిన నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు. నేషనల్ అవార్డు అందుకున్నాడు కూడా. పుష్ప సినిమాలో సాంగ్స్, అల్లు అర్జున్ మేనరిజమ్ ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. అందుకే పుష్ప ది రూల్ సినిమాపై దేశవ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది. ఈ మూవీ ఏమాత్రం వర్కౌట్ అయినా కానీ వెయ్యికోట్లు వసూలు చేయడం పెద్ద కష్టమేం కాదు.

దేవర
రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ తో ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు తారక్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దేవర మీద కూడా భారీ అంచనాలున్నాయి. జాన్వి కపూర్ హీరోయిన్…ఈ మూవీ క్లిక్ అయితే వెయ్యికోట్లు కొట్టేయడం పక్కా…

గేమ్ ఛేంజర్
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న గేమ్ ఛేంజర్ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. RRR తో పాన్ ఇండియా హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్న చరణ్ కి ఈ మూవీ చాలా ప్రత్యేకం. పైగా శంకర్ దర్శకుడు కావడంతో ఫ్యాన్స్ కి భారీ ఆశలే ఉన్నాయి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కూడా భారీగానే వసూలు చేస్తుందని ఫిక్సైపోయారు…

మొన్నటి వరకూ పాన్ ఇండియా రేంజ్ అంటే ప్రభాస్ పేరు మాత్రమే వినిపించేది…ఇప్పుడు ఆ లిస్టులో చేరుతున్న టాలీవుడ్ హీరోల సంఖ్య ఎక్కువే ఉంది. అందరూ సక్సెస్ అవ్వాలని, వారి అంచనాలు నిజమవ్వాలనే కోరుకుందాం…