ఎక్కడచూసినా ఓటీటీల హవానే నడుస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్ లోని పెద్ద పెద్ద స్టార్లంతా డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై సినిమాలు, వెబ్ సిరీస్ లు, రియాల్టీ షోస్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడీ లిస్ట్ లో చేరారు మెగాస్టార్ చిరంజీవి…
చిరు ఫస్ట్ వెబ్ సిరీస్!
కరోనా ముందు తర్వాత ఓటీటీ రేంజ్ ఓ రేంజ్ లో మారిపోయింది. ఊహించనంతగా ఓటీటీ కంటెంట్ కి డిమాండ్ పెరిగింది. అందుకే అగ్రహీరోలు, యంగ్ హీరోలు, ఫేడవుట్ అయిన తారలు కూడా డిజిటల్ ఎంట్రీపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ లాంటి సీనియర్ హీరోలు ఏదో ఒక రకంగా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ లిస్టులో చేరిపోయారు. ఫస్ట్ వెబ్ సిరీస్ కి సైన్ చేసినట్లు ఫిలిం సర్కిల్స్ లో ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. చాలా కాలంగా ఓటీటీ అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్న చిరంజీవి తన ఇమేజ్ కి సూట్ అయ్యే కంటెంట్ దొరికితే కచ్చితంగా వెబ్ సిరీస్ చేస్తానని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. చెప్పినట్లుగానే తాజాగా ఓ ప్రముఖ ఓటీటీ సంస్థలో వెబ్ సిరీస్ చేసేందుకు మెగాస్టార్ ఒప్పందం కుదురుచుకున్నట్లు టాక్ .
‘విశ్వంభర’ తో బిజీ
ప్రస్తుతం చిరంజీవి ‘బింబిసార’ మూవీ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. సోషియో ఫాంటసీ జోనర్ లో రూపొందనున్న ఈ సినిమా ఇటీవల ఓ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక తాజాగా హైదరాబాద్ లో మరో షెడ్యూల్ మొదలైంది. లేటెస్ట్ షెడ్యూల్లో చిరంజీవి, త్రిష లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే హైదరాబాదులోని భారీ సెట్ కూడా వేసినట్లు తెలుస్తోంది. సుమారు రూ.100 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఏ జోనర్ అంటే!
ఎక్కువగా థ్రిల్లర్ కాన్సెప్టు వెబ్ సిరీసులకు క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే చిరంజీవి కూడా అలాంటి వెబ్ సిరీసుతో ప్రేక్షకుల ముందుకు వస్తారని అంటున్నారు. ప్రస్తుతానికైతే ఎలాంటి సిరీస్, ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో చేస్తున్నారనే విషయం క్లారిటీ లేదు కానీ మెగాస్టార్ డిజిటల్ ఎంట్రీ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్సుంది. దశాబ్దాలుగా సిల్వర్ స్క్రీన్‌ను ఏలుతున్న చిరు మరి ఓటీటీ ప్లాట్‌ఫాంలో ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ..