అడివి శేష్.. అక్కినేని కుటుంబానికి చెందిన సుప్రియ యార్లగడ్డతో రిలేషన్ లో ఉన్నాడనేది ఎప్పటి నుంచో ఉన్న ప్రచారం. పెళ్లిచేసుకుంటారనే వార్తలు ఎప్పటినుంచో వస్తున్నాయి..అయితే..తాజాగా డేట్ కూడా ఫైనల్ అయ్యిందని టాక్.
జూన్ 16న సుప్రియ-శేష్ పెళ్లి
అక్కినేని నాగార్జున మేనకోడలు, నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ. పవన్ కళ్యాణ్ మొదటి సినిమా అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయిలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ తీసుకుంది. లాంగ్ గ్యాప్ తర్వాత గూఢచారి సినిమాలో కీలకపాత్రలో నటించింది. ఆ తర్వాత నుంచి అడవిశేష్ తో రిలేషన్ షిప్ లో ఉన్న వార్తలు జోరందుకున్నాయి. 2019 నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు వార్తలొచ్చాయి. అక్కినేని వారింట జరిగే శుభకార్యాల్లో శేషు కనిపించడం…వాళ్లిద్దరూ కలసి ఉన్న ఫొటోలు బయటకు రావడంతో ఇక పెళ్లే తరువాయి అనుకున్నారు. తాజాగా డేట్ ఫిక్స్ అయినట్టు టాక్. సుప్రియ-శేష్ పెళ్లికి జూన్ 16న డేట్ ఫిక్సైందని…ఈ పెళ్లిని అక్కినేని నాగార్జున దగ్గరుండి జరిపిస్తారని సమాచారం.
సుప్రియ మొదటి భర్త ‘ఇష్టం’ హీరో చరణ్
సుప్రియ తండ్రి సురేంద్ర యార్లగడ్డ, తల్లి సత్యవతి యార్లగడ్డ, సోదరుడు సుమంత్. తల్లి సత్యవతి మరణించారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుప్రియ..ఆ మూవీ తర్వాత నటనకు దూరంగా ఉంటూ నిర్మాణ రంగంలోకి ప్రవేశించింది. 1997 ఆమె ‘ఆహా’ చిత్రాన్ని నిర్మించింది. 2000లో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకుంది. సుప్రియ మొదటి భర్త ‘ఇష్టం’ హీరో చరణ్ మరణించాడు. చాలా ఏళ్ల తర్వాత 2018లో గూఢచారి సినిమాలో నటించింది. ఆ సినిమా సమయంలోనే అడవి శేష్ తో పరిచయం ప్రేమగా మారినట్టు తెలుస్తోంది.
అతిథి పాత్రల నుంచి హీరోగా ఎదిగిన శేష్
సొంతం (2002) సినిమాలో అతిథి పాత్రలో నటించాడు అడివి శేష్. ‘క్షణం’ మూవీతో హీరోగా బ్రేక్ అందుకోవడంతో కెరీర్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. గూఢాచారి, ఎవరు, మేజర్ ప్రేక్షకులను మెప్పించాయి. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మేజర్ ను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేశారు. రీసెంట్ గా హిట్-2 తోనూ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం గూఢచారి సీక్వెల్లో బిజీగా ఉన్నాడు.
సుప్రియకి 45 – శేష్ కి 38
ప్రస్తుతం సుప్రియ వయస్సు 45 ఏళ్లు కాగా అడవి శేష్ వయస్సు 38 సంవత్సరాలు. ఒకప్పుడు వరుడు వయసు వధువు వయసు కన్నా ఎక్కువ ఉండాలని చెప్పేవారు. ఇప్పుడు ప్రేమికులకు అదేం పెద్ద పట్టింపులేదు. అభిషేక్ కన్నా ఐశ్వర్యా రాయ్ పెద్దది, మహేష్ కన్నా నమ్రత పెద్దది, నిక్ కన్నా ప్రియాంక చాలా పెద్దది… త్వరలో పెళ్లిచేసుకుంటారని చెబుతున్న మలైకా కన్నా అర్జున్ కపూర్ వయసు చాలా తక్కువ. అంటే.. ఇప్పటి తరానికి వయసు పెద్ద మేటర్ కాదు. సంతోషంగా ఉన్నారా లేదా అన్నదే ఫైనల్. మొత్తానికి సుప్రియ-శేష్ పెళ్లివార్త వాస్తవమో-ప్రచారమో వెయిట్ అండ్ సీ..