జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చంద్రబాబుతో మరోసారి భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగింది. పవన్ తో పాటు నాదెండ్ల మనోహర్ ఉన్నారు. వర్షాల కారణంగా పాదయాత్రకు విరామం ఇచ్చి హైదరాబాద్ వచ్చిన నారా లోకేష్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే మార్చిలోనే సాధారణ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో .. కూటమిగా చేయాల్సిన పనులు, సీట్ల సర్దుబాటు, ఇతర ఎన్నికల వ్యూహాలపై వీరు మాట్లాడుకున్నట్లుగా తెలుస్తోంది.
జనసేనను 20 సీట్లకే పరిమితం చేయాలని చంద్రబాబు చూస్తున్నారా ?
టీడీపీతో పొత్తు పెట్టుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయో గతంలో చాలా పార్టీలు చూశాయి. సీట్లు కేటాయించినా … టీడీపీ అనధికారిక అభ్యర్థులు పోటీలో ఉంటారు. అయినా అతి తక్కువ సీట్లు కేటాయిస్తారు. ఇప్పుడు కూడా జనసేనకు అదే పరిస్థితి ఎదురయ్యేలా ఉంది. జనసేనకు ఇరవై సీట్లే కేటాయిస్తామని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. అదీ కూడా టీడీపీకి చాన్సుల్లేని చోట్ల ఎక్కువ సీట్లు ఇవ్వజూపుతున్నారని అంటున్నారు. చంద్రబాబు సీట్ల చర్చలపై పవన్ అసంతృప్తికి గురయినట్లుగా చెబుతున్నారు. నాదెండ్ల కూడా సమావేశంలో ఉండటంతో ఆయన పెద్దగా చర్చించలేదని తెలుస్తోంది.
మార్చి లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే చాన్స్
వర్షాల కారణంగా శ్రీశైలం పర్యటన వాయిదా పడటంతో హఠాత్తుుగా పవన్ కల్యాణ్, నాదెండ్లతో సమావేశం ఖరారయింది. . సమావేశంలో లోకేష్ కూడా ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. లోకేష్ పాదయాత్ర ముగింపు సభలో పవన్ కల్యాణ్ కూడా పాల్గొనాలని ఇప్పటికే నిర్ణయించారు. వచ్చే మూడు నెలల కాలంలో పూర్తి స్థాయిలో టీడీపీ, జనసేన ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కలిసి ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా.. ఉమ్మడి మేనిఫెస్టోన గ్యారంటీ పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. కానీ సీట్లవిషయంలో క్లారిటీ లేకపోతే ప్రజల్లో నమ్మకం ఉండదంటున్నారు.
బలంగా ఉన్న స్థానాల్లో పోటీ చేస్తామంటున్న పవన్
బలం ఉన్న స్థానాల్లోనే పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ చాలా కాలంగా చెబుతున్నారు. అదే సమయంలో బీజేపీని కలుపుకుని వెళ్లే విషయం పైనా చర్చలు జరుగుతున్నాయని భావిస్తున్నారు. ఢిల్లీలో మారుతున్న రాకీయ పరిస్థితుల్లో బీజేపీని కలుపుకోవాలని అనుకుంటున్నారు. కానీ బీజేపీ కలసి వస్తుందా లేదా అన్నదానిపైనే స్పష్టత లేదు