ఏబీవీపీ.. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. 75వ ఫౌండేషన్ డే జూలై 9. విద్యార్థులలో వున్న నాయకత్వ లక్షణాలు గుర్తించి వారిని వివిధ రంగాలలో భవిష్యత్ జాతి అవసరాలకు తగ్గట్టు తీర్చి దిద్దుతున్న సంస్థ విద్యార్థి పరిషత్. ఈ రోజుదేశ నిర్మాణంలో భాగం అవుతున్న నేతల్లో అత్యధికులు ఏబీవీపీ నుంచి వచ్చిన వారే. జ్ఞాన్, షీల్ ఔర్ ఏక్తా అంటే జ్ఞానం, వ్యక్తిత్వం , ఐక్యత మూడు లక్షణాల పునాదులుగా ఏబీవీపీ 75 ఏళ్ల కిందట ఆవిర్భావించింది.
75 ఏళ్ల కిందట ఆవిర్భావం
ఏబీవీపీ 9 జూలై 1949న ఆవిర్భావించింది. భారతీయ కళాశాలలు , విశ్వవిద్యాలయాలలో భారతీయ విలువలను కనుమరుగు చేసేందుకు ..హిందూయతను అణిచివేసేందుకు కుట్రలు జరుగుతున్న సమయంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త బాల్‌రాజ్ మధోక్ , ప్రొఫెసర్ యశ్వంతరావు కేల్కర్‌లు విద్యార్థి సంస్థను ఏర్పాటు చేయడానికి చేతులు కలిపారు. మధోక్ ఆలోచన కేల్కర్ కార్యాచరణతో ఏబీవీపీ దేశం కోసం పయనం ప్రారంభించింది. దేశం ఏబీవీపీ చేసిన పోరాటాలు లెక్కలేనన్ని ఉన్నాయి. జయప్రకాష్ నాారయణ ఆందోళనతో సహా ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్నంది. చిన్న స్థాయిలో ప్రారంభమై స్పష్టమైన లక్ష్యాలు.. ఉద్దేశాలతో విద్యార్థులో ఆదరణ పొందింది. క్రమంగా ఏబీవీపీ భావజాలం దేశవ్యాప్తంగా వ్యాపించింది.
ఎమర్జెన్సీలో ఇందిర గాంధీ అత్యధిక టార్గెట్ చేసింది ఏబీవీపీనే
ఇందిరాగాంధీ భారతదేశంలో ఎమర్జెన్సీ విధించిన తర్వాత ఏబీవీపీ నాయకులు ఎందరో జైలుకువెళ్లారు. చాలా మంంది అండర్‌గ్రౌండ్‌కు వెళ్లి మారువేషంలో ఉండి ప్రభుత్వంపై పోరాడారు. ఎమర్జెన్సీ సమయంలో ఏబీవీపీ చెందిన యువ విద్యార్థి నాయకులు క్రూరంగా హింసించారు. దీనికి సంబంధించి అనేక ఉదంతాలు వెలుగు చూశాయి. ఎమర్జెన్సీ ఎత్తివేయడంతో యువరక్తం ఉడికిపోవడంతో ఇది ఏబీవీపీ మరింత బలపడటానికి కారణం అయింది. ఎమర్జెన్సీ తర్వాత ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలలో విద్యార్థి యూనియన్ ఎన్నికలలో విజయం ఏబీవీపీనే విజయం సాధించేది. అలాంటి వాటిలో ఒకటి ఢిల్లీ విశ్వవిద్యాలయం . అక్కడి నుంచి దేశం మొత్తం ఏబీవీపీ విస్తరించింది. నిజానికి ఏబీవీపీ బీజేపీకి అనుబంధం అనుకుంటారు. కానీ ఏబీవీపీ సిద్దాంతాలు.. బీజేపీకి దగ్గరగా ఉంటాయి కానీ ఆ పార్టీకి అనుబంధం కాదు. సిద్దాంతాలు దగ్గర కాబట్టే ఎక్కువ మంది ఏబీవీపీ నుంచి బీజేపీలో నేతలుగా ఎదిగారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కి అనుబంధంగా ఏబీవీపీ ఉంటుంది. ప్రపంచంలో ఏ విద్యార్థి సంస్థకూ లేనంత మంది సభ్యులు ఏబీవీపీకి ఉన్నారు.
దేశానికి నాయకత్వాన్ని అందిస్తున్న ఏబీవీపీ
ఏబీవీపీ నుంచి వచ్చిన నాయకులు ఇప్పుడు భారత రాజకీయాల్లో శక్తివంతమైన , ప్రభావవంతమైన స్థానాల్లో ఉన్నారు. బిజెపి యువ రక్తాన్ని ఏబీవీపీ అందిస్తుందని చెప్పుకోవచ్చు. రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, అరుణ్ జైట్లీ, ప్రకాశ్ జవదేకర్, దేవేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కరీ, రాధా మోహన్ సింగ్, రవిశంకర్ ప్రసాద్ , జేపీ నడ్డా వంటి రాజకీయ నాయకులు ఏబీవీపీ నుంచే వచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోని యువనాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, నాగోతు రమేష్ నాయుడు, పీవీఎల్ మాధవ్ కూడా ఏబీవీపీ నుంచి నాయకత్వ లక్షణాలతో ప్రజా జీవితంలోకి వచ్చినవారే.
రాజకీయ కారణాలతో ఏబీవీపీపై ఎంతో మంది రకరకాల ముద్రలు వేశారు. కానీ.. అవన్నీ కాలపరీక్షలో నిలవలేకపోయాయి. ఇప్పుడు ఏబీవీపీ అత్యధిక మంది విద్యార్థుల జీవనశైలిలో భాగం. వారిలో ని నాయకత్వ లక్షణాలను పదును పెట్టడానికి ఏబీవీపీ ఎప్పుడూ రెడీగా ఉంటుంది.