తెలుగు సినిమా ఆర్ ఆర్ ఆర్కు ఆస్కార్ దక్కింది. ఇండియన్ సినిమాలో సరికొత్త హిస్టరినీ క్రియేట్ చేసింది. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 25, 2022న విడుదలై కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఇప్పటికే పలు ప్రఖ్యాత అవార్డ్‌లను అందుకున్న ఈ చిత్రం తాజాగా 95వ ఆస్కార్ ఆస్కార్ అవార్డ్స్‌లో ఫంక్షన్ నాటు నాటు పాటకు ఆస్కార్‌ను గెలిచి సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.
ప్రతిష్టాత్మక ఆస్కార్ వేదికపై ఆర్ ఆర్ ఆర్ నాటు నాటుకు (Naatu Naatu won the Oscar) ఆస్కార్ అవార్డ్ దక్కింది. 95 వ అకాడమీ(Oscars) అవార్డులలో తెలుగు సినిమాకు ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ దక్కింది. దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలోని నాటు నాటు పాట… ఆస్కార్‌కి దక్కించుకోవడం ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించినట్టైంది. ఓ తెలుగు చిత్రం ఆస్కార్‌కి నామినేట్ కావడం ఇదే తొలిసారి. ఆ పురస్కారం అందుకోవడం కూడా మొదటిసారే. అచ్చమైన భారతీయ సినిమాకి దక్కిన తొలి ఆస్కార్గా చరిత్ర సృష్టించింది. నాటు నాటుకు సంగీతం అందించిన కీరవాణి ఆస్కార్ ప్రతిమ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రాజమౌళిని ఉద్దేశిస్తూ ఓ పాట కూడా పాడారు. ఆస్కార్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు పాట నామినేషన్ పొందింది. ఈ పాటతో పాటు మరో నాలుగు పాటలు (అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్), హోల్డ్ మై హ్యాండ్ ( టాప్‌గన్: మార్వెరిక్), లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్), ది ఈజ్ ఏ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) సినిమాలవి నామినేట్ అయ్యాయి. ఇక ఈరేసులో తెలుగు సినిమా ఆస్కార్ పొంది భారతీయ చలనచిత్ర చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.
ఇక ఇదే ఆస్కార్ కార్యక్రమంలో మరో ఇండియన్ డాక్యుమెంటరీకి ఆస్కార్ దక్కింది. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌గా ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్‌ను గెలుచుకుంది. ఇది ఇండియా నుంచి నామినేట్ అయిన డాక్యూమెంటరీ షార్ట్ ఫిల్మ్. హాలౌట్, హౌ డూ యూ మేజర్ ఏ ఇయర్, ది మార్తా మిచెల్ ఎఫెక్ట్, స్రెంజర్ ఎట్ ది గేట్.. పోటీ పడ్డాయి.. ఈ డాక్యుమెంటరీని కార్తీకి గాన్ స్లేవ్స్, గునీత్ మెంగా నిర్మించారు.