భోజ్పూర్ అన్ – ఫినిష్డ్ నగరం అంటారు. అంటే అసంపూర్ణ నగరం అని అర్థం. భారత మధ్య భూభాగంలో ఉన్న పర్వత పంక్తుల మీద క్రీ. శ. 11 వ శతాబ్దంలో పుట్టింది భోజ్పూర్ నగరం. ఈ పురాతన నగరానికి వెనుక వైపు బెత్వ నది ప్రవహించడం వల్ల ఇది పర్యాటకలను ఆకర్షించే ప్రదేశంగా విశేష ఆదరణ పొందింది. మధ్య ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయిన భోపాల్ నుంచి 28 కి.మీ. దూరంలో ఉన్న భోజ్పూర్ లో ప్రధానంగా చూడవలసిన ప్రదేశాలు రెండు. ఒకటి భోజేశ్వర ఆలయం, మరొకటి పార్వతి గుహ. ఇందులో భోజేశ్వర ఆలయ ప్రత్యేకతే వేరు..
భోజేశ్వర్ దేవాలయం
భోజేశ్వర్ ఆలయం…భోజ్పూర్ లో అసంపూర్తిగా ఉన్న ఒక అద్భుతమైన నిర్మాణం. భారత్ లో ఉన్న పెద్ద శివలింగాలలో ఈ ఆలయంలో ఉన్న శివలింగం ఒకటి. ఈ ఆలయంలో శివలింగం ఒకే రాతిలో మలిచారు. 7.5 అడుగుల పొడవు 17.8 అడుగుల చుట్టుకొలతతో ఉంటుంది. ఈ ఆలయాన్ని ‘తూర్పు సోమ్నాథ్’ అని పిలుస్తారు. క్రీ. శ. 11-13 వ శతాబ్దంలో జరిగిన ఈ ఆలయ నిర్మాణం పూర్తై ఉంటే దేశంలో అద్భుతంగా నిలిచి ఉండేది. గోపురం, రాతి నిర్మాణాలు, ద్వారబంధానికి ఇరువైపులా చెక్కిన బొమ్మలు అలాగే నిలబెడతాయి. గోపురం స్థాయికి ఆలయ నిర్మాణం పెంచాలని ప్రయత్నించా అది జరగలేదు. అందుకే ఈ శివాలయం అసంపూర్ణంగా కనిపిస్తుంది.
పార్వతి గుహ
పార్వతి గుహ భోజ్పూర్ లో తప్పక చూడవలసిన ప్రదేశం. ఇది భోజేశ్వర్ ఆలయానికి ఎదురుగా ఉంది. ఈ గుహలో క్రీ. శ. 11 వ శతాబ్ద కాలానికి చెందిన అనేక రాతి నిర్మాణాలు, పురాతన శిల్పాలు ఆకట్టుకుంటాయి.
ఇంకా చూడాల్సిన ప్రదేశాలు
జైన దేవాలయాలు భోజేశ్వర్ ఆలయానికి సమీపంలో ఉన్నాయి. ఈ ఆలయంలో కూడా అన్ని అజిన దేవాలయాల్లా మూడు తీర్థంకరుల విగ్రహాలు ఉన్నాయి. వీటిలో ఒకటి వర్ధమాన మహావీరుని విగ్రహం 20 అడుగుల విగ్రహం, మిగిలిన రెండు విగ్రహాలు పార్శ్వనాథుడువి గా ఉన్నాయి. నగరం నుంచి 20కి.మీ. దూరంలో భిమేత్క ఉంది. ఇక్కడి రాతి చిత్రాలు అబ్బురపరుస్తాయి. ప్రపంచంలో ఉత్తమమైన వాటిలో ఒకటిగా భిమేత్క ను వరల్డ్ హెరిటేజ్ సెంటర్ యునెస్కో గుర్తించింది.
భోజ్పూర్ నుంచి బస్సు మార్గం ద్వారా భోపాల్ కు మంచి కనెక్టివిటీ ఉన్నది. భోపాల్ రైల్వే స్టేషన్ దేశంలో దాదాపు అన్ని ప్రదేశాలకు కనెక్ట్ అయి ఉంది. భోపాల్ విమానాశ్రయం కూడా ఉంది. ఏ మార్గంలో వెళ్లాలనుకున్నా ప్రయాణికులకు ఇబ్బంది ఉండదు.
గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.