కౌంటింగ్‌కు సర్వం సిద్ధం – అందరి దృష్టి ఏపీ ఎన్నికల ఫలితాలపైనే

రాజకీయ పార్టీల భవితవ్యం తే తేల్చే కౌంటింగ్‌కు కౌండ్‌డౌన్ మొదలైంది. కౌంటింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో కూటమి ఫుల్ జోష్‌లో ఉంది. కూటమి గెలుపు కోసం మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేశారన్నారు చంద్రబాబు. పూర్తి స్థాయి ఫలితాలొచ్చే వరకు అశ్రద్ధ వద్దని చంద్రబాబు సూచించారు.

ఎగ్జిట్ పోల్స్ లో కూటమి ముందంజ

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారం కైవసం చేసుకోబోతోందని కీలక సర్వేలు పేర్కొన్నాయి. తాజాగా మై యాక్సిస్‌ ఇండియా టుడే సర్వే ఈ జాబితాలోకి చేరింది. టీడీపీ సొంతంగా 78 నుంచి 96 స్థానాల్లో విజయం వరిస్తుందని, మిత్రపక్షం జనసేన పార్టీ..16 నుంచి 18 స్థానాలు.. బీజేపీ నాలుగు నుంచి ఆరు స్థానాల్లో గెలుపొందుతాయని అంచనా వేసింది. ఇక… అధికార వైసీపీ పార్టీ మాత్రం 55 నుంచి 77 స్థానాలకే సర్వేలో వెల్లడైంది. ఇక కాంగ్రెస్‌ పార్టీకి సున్నా నుంచి రెండు స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు ఆ సంస్థ సర్వే వెల్లడించింది.

ఓట్ల తేడా కూడా భారీగా !

పార్టీల వారీగా ఓటు షేర్‌ చూస్తే.. తెలుగుదేశానికి 42శాతం, వైసీపీకి 44 శాతం, జనసేనకు 7 శాతం ఓటింగ్ ఉండగా.. బీజేపీ, కాంగ్రెస్ చెరో 2 2 శాతం, ఇతరులు 3శాతం ఓట్లను షేర్‌ చేసుకునే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తుంది.. లోక్‌సభకు సంబంధించి టీడీపీ 13 నుంచి 15 సీట్లు గెలుచుకునే అవకాశం ఉండగా.. జనసేన 2, బీజేపీ 4 నుంచి 6 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని సర్వేలో ప్రకటించింది. అధికార వైసీపీ 2 నుంచి 4 స్థానాలు గెలిచే అవకాశం మాత్రమే ఉందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.

వైసీపీది కూడా అదే నమ్మకం !

జూన్ 9న వైజాక్ లో జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు అమరావతిలో ప్రమాణస్వీకారం చేయబోతున్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నతలు . ఎవరెన్ని చెప్పిన ఎన్ని సర్వేలు చేసిన సీఎం అయ్యేది ఒకరే.. ఇప్పడు ఆ ఒక్కరు ఎవరనేది ఏపీ ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. దానికి ఇరవై నాలుగు గంటల్లో తెరపడనుంది.