ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ వందలాది తప్పులు చేస్తోంది. ఏదో విధంగా పరువు కాపాడుకునే ప్రయత్నంలో మరిన్ని తప్పులు చేస్తోంది. కొందరు కాంగ్రెస్ నేతలు ఏకంగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాపై కూడా ఆరోపణలు సంధిస్తున్నారు. ఒక ఆధారం కూడా లేకుండా ఇష్టానుసారం మాట్లాడి అభాసుపాలవుతున్నారు. చివరకు చీవాట్లు తిన్నా బుద్ధి రావడం లేదు. ఆధారాలెక్కడివి అని అడిగితే కాంగ్రెస్ నేతలు నీల్లు నములుతున్నారు….
150 మంది కలెక్టర్లకు లేఖలు రాశారట…
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, పార్టీ కమ్యూనికేషన్స్ ఇంచార్జ్ జైరాం రమేష్ ఒక విచిత్రమైన ఆరోపణ చేశారు. ఎన్నికల్లో బీజేపీ అన్నిరకాల అవకతవకలకు పాల్పడిందని అంటూ… ఏకంగా కేంద్ర హోం మంత్రి అమత్ షా మీదే ఏదో గేమ్ ఆడబోయారు. దేశం వ్యాప్తంగా 150 మంది కలెక్టర్లకు ఆయన ఫోన్ చేశారన్నది జైరాం రమేష్ ఆరోపణ. బీజేపీ నిరాశలో మునిగిపోయి ఎన్నికల ప్రక్రియను దెబ్బతీసే ప్రయత్నంలో ఉందని జైరాం రమేష్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. అయితే జనం మాత్రం తమకే ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
వివరణ అడిగిన ఎన్నికల సంఘం…
జైరా రమేష్ చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి కావడంతో కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. 150 మంది కలెక్టర్లతో అమిత్ షా మాట్లాడినట్లుగా సాక్ష్యాధారాలను సమర్పించాలని జైరాం రమేష్ ను ఆదేశించింది. తమకు ఎవరైనా ఫోన్ చేసినట్లు ఒక్క కలెక్టర్ కూడా నివేదిక సమర్పించలేదని ఈసీ పేర్కొంది. ఓట్ల లెక్కింపు అనేది ఒక పవిత్రమైన బాధ్యత అని దానిపై ఎవరి జోక్యం ఉండదని ఈసీ గుర్తు చేసింది. అలాంటి పనులు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఏమీ లేకుండా జైరాం రమేష్ లాంటి నేతలు ఆరోపణలు చేయడం మాత్రం సహేతుకం కాదని ఈసీ మరో సారి హెచ్చరిస్తూ ఆయన వద్ద ఉన్న ఆధారాలను 24 గంటల్లో అందించాలని కూడా ఆదేశించింది.
మణిశంకర్ అయ్యర్ తరహాలోనే…
కాంగ్రెస్ నేతలు అర్థం లేని ఆరోపణలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. మన దేశంలో ఉంటూ పాకిస్థాన్ ను వాళ్లు సమర్థిస్తుంటారు. పాక్ దగ్గర అణుబాంబు ఉంది జాగ్రత్త అని ఇటీవల సీనియర్ కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రెండు మూడు రోజులకే ఆయన చైనాను వెనుకేసుకొచ్చారు. ఇప్పుడు జైరాం రమేష్ కూడా అలాంటి చర్యలకే దిగుతున్నారనుకోవాలి…