మోదీ తీన్మార్. ఇదే విషయాన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఒకటి ఆరా కాదు మొత్తం అదే చెప్పాయి. ఏడు విడతల పోలింగ్ లో ప్రతీ విడత ముగిసే సరికి. .. బీజేపీ ఆ రాష్ట్రంలో సీట్లు కోల్పోయిందని.. ఈ రాష్ట్రంలో సీట్లు కోల్పోయిందని ప్రచారం జరగడం అంతా తుస్సేనని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి.
బీజేపీ జోరు
దాదాపు రెండు నెలల పాటు హౌరాహౌరీగా సాగిన ఎన్నికల సంగ్రామం తుది దశ పోలింగ్‌తో శనివారం ముగిసింది. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గానూ ఏడు దశల్లో జరిగిన ఎన్నికలతో భారత్ ఒక మహా ఘట్టాన్ని పూర్తి చేసుకున్నది. ప్రజలంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వచ్చాయి. పలు జాతీయ, ప్రాంతీయ వార్తా ఛానెళ్లు, సర్వే సంస్థలు తాము నిర్వహించిన సర్వే ఆధారంగా పలు పార్టీలు, కూటములకు వచ్చిన సీట్లను, ఓటింగ్ శాతాన్ని రాష్ట్రాలవారీగా విడుదల చేశాయి.
ఏ మాత్రం మెరుగుపడని ఇండి కూటమి
ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఎన్డీయేదే పైచేయిగా కనిపించింది. ఆ కూటమి 350కి పైగా లోక్‌సభ స్థానాలను గెలవచ్చని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంచనా వేశాయి. ఇండియా బ్లాక్ ఈ సర్వే ఫలితాల్లో దాదాపు 150 స్థానాలను మాత్రమే కైవసం చేసుకోనున్నట్టు తేలింది. ఇతరులు దాదాపు 50 లోపు లోక్‌సభ సీట్లు గెలవచ్చని అంచనా. జాతీయ మీడియా చానళ్ల సర్వేలన్నీ ఒకే రీతిన ఉన్నాయి. ఎన్డీటీవీ ‘పోల్ ఆఫ్ పోల్స్’ ఎన్డీయే 365 స్థానాలను గెలుస్తుందని అంచనా వేసింది. అంటే అన్ని పోల్స్ ను కలిపి చెప్పిన పోల్ ఇది. ఇండియా బ్లాక్ 142 స్థానాలు, ఇతరులు 36 స్థానాల్లో విజయం సాధిస్తారని వివరించింది.
దక్షిణాదిన భారీ విజయాలు
దక్షిణాదిలో మాత్రం బీజేపీకి మంచి ఫలితాలే రానున్నాయని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తున్నాయి. తమిళనాడులో రెండెంకెల స్థానాలను గెలుస్తామన్న బీజేపీ ఆశలు నెరవేరకపోయినా బలమైన ముద్ర వేయబోతున్నట్లుగా స్పష్టమవుతోంది. దేశంలో అత్యంత విశ్వసనీయమైన సర్వేగా యాక్సిస్ మై ఇండియాను పేర్కొనవచ్చు. ఈ సంస్థల సర్వే ఫలితాల ప్రకారం దక్షిణాదిలో బీజేపీ మెరుగైన సీట్లు సాధింబోతోంది. తమిళనాడులో రెండు వరకూ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కర్నాటకలో ఎన్డీయే 23-25 స్థానాలు, ఇండియా బ్లాక్ 3-5 సీట్లు గెలవనున్నది. కేరళలో ఎన్డీయే 2-3 సీట్లు, యూడీఎఫ్ 17-18 స్థానాలు, లెఫ్ట్ 0-1 స్థానం కైవసం చేసుకోనున్నట్టు చెప్పింది. ఏపీలో ఇరవై మూడుసీట్లు వరూ గెలవనుంది.