లేడీ సూపర్ స్టార్ – చెన్నై చంద్రం మధ్య కోల్డ్ వార్!

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌ – చెన్నై చంద్రం త్రిష మధ్య కోల్డ్ వార్ మొదలైందా? ఓ మూవీఆఫర్ కోసం ఇద్దరూ పోటీపడుతున్నారా? ఇద్దరిలో నెగ్గేదెవరు? తగ్గేదెవరు? అసలేం జరిగింది? ఆ మూవీ డీటేల్స్ ఏంటి? వాచ్ దిస్ స్టోరీ…

నయనతార కన్నా త్రిష రెండేళ్ల ముందే ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. దీంతో ఆరంభంలో నయన్ కన్నా త్రిష స్టార్ హీరోయిన్ గా వెలిగింది. కొన్నాళ్ల జోరు తర్వాత త్రిష కెరీర్ మందగించింది…అదే టైమ్ లో నయన్ పుంజుకుంది. తనకంటూ ప్రత్యేకత ఉన్న క్యారెక్టర్స్ ఎంపికచేసుకుంటూ లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. త్రిషను మించి అనిపించుకుంది. పైగా నయన్ కు ఉండే ఫాలోయింగ్ వేరు కావడంతో కెరీర్లో ఇప్పటికీ దూకుడు కొనసాగుతోంది. ఇలాంటి టైమ్ లో వచ్చిన పొన్నియన్ సెల్వన్ మూవీ త్రిష కెరీర్ని మలుపుతిప్పేసింది. మళ్లీ స్టార్ హీరోయిన్ రేంజ్ లో వెలుగుతోంది. ప్రస్తుతం సీనియర్ హీరోలందరకీ త్రిష బెస్ట్ ఆప్షన్ గా మారింది. కెరీర్ జోరు పెరిగింది. దీంతో నయన్-త్రిష మధ్య మళ్లీ పోటీ మొదలైంది…

మూక్తి అమ్మన్ సీక్వెల్లో ఎవరు!
సౌత్ మూవీస్ కి వరుసగా సైన్ చేస్తూ త్రిష దూసుకుపోతుంటే…నయనతారమాత్రం సెలెక్టెడ్ గా మూవీస్ చేస్తోంది. ఇలాంటి టైమ్ లో త్రిష‌- న‌య‌న్ మ‌ధ్య ఓ ప్రాజెక్ట్ విష‌యంలో ఇంట‌ర్న‌ల్ గా కోల్డ్ వార్ మొద‌లైందని కోలీవుడ్ టాక్. న‌య‌న‌తార‌కు రావాల్సిన ఛాన్స్ ని త్రిష త‌న్నుకుపోతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎన్ జె శ‌ర‌వ‌ణ‌న్-ఆర్ జే బాలాజీ సంయుక్తంగా న‌య‌న‌తార ప్ర‌ధాన పాత్ర‌లో మూకుత్తి అమ్మ‌న్ అనే సినిమా తెర‌కెక్కించారు. నాలుగేళ్ల క్రితం రిలీజైన ఈ మూవీ సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడీ సినిమాకి సీక్వెల్ తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా బాధ్య‌త‌లు పూర్తిగా బాలాజీ తీసుకున్నాడు. అయితే ఇందులో న‌య‌న్ పాత్ర‌లో త్రిష‌ని తీసుకోవాల‌ని శ‌ర‌వ‌ణ‌న్ రిఫ‌ర్ చేస్తే….న‌య‌న్ మాత్రం త‌న‌కే ఆ ఛాన్స్ కావాలని బాలాజీ ముందుకు ప్ర‌పోజ‌ల్ పెట్టింది.

ఇప్పటివరకూ ఆఫర్స్ విషయంలో నేరుగా మాట్లాడని నయన్…ఫస్ట్ టైమ్ ఛాన్స్ కోసం డైరెక్ట్ గా ఎంటరైంది. దీంతో నయన్-త్రిష మధ్య కోల్డ్ వార్ మొదలైందంటోంది కోలీవుడ్ మీడియా…ఈ మూవీ తెలుగులో అమ్మోరుతల్లిగా వచ్చింది. ఏదేమైనా అమ్మోరు తల్లి సీక్వెల్ లో త్రిష నటించడమే ఫైనలైందని టాక్. మరి నయన్ ఏమంటుందో…