చియా విత్తనాలు..ఈ పేరు వినే ఉంటారు. సూపర్ ఫుడ్ కేటగిరీకి చెందిన ఈ విత్తనాలు మంచి ఆరోగ్యప్రయోజనాలను అందించడంతో పాటూ ఊబకాయాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. పిల్లలకు పెద్దలకు కూడా ఇవి అద్భుతమైన ఆహారం. వీటిలో ఫైబర్, ప్రోటీన్ సహా వివిధ విటమిన్లు సమృద్ధిగా ఉండటంతో ఆరు నెలల చిన్నారుల నుంచి అన్ని వయసులవారు తినొచ్చు. కనీసం ఓ అరగంటపాటూ నీటిలో నానబెట్టి ఆ వాటర్ తాగొచ్చు, పాయసం, జ్యూస్ లలో కలపి తీసుకోవచ్చు. ఈ విత్తనాలవల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయంటే…
కాల్షియం
చాలా మంది పిల్లలు పాలు తాగడానికి, ఎగ్ తినడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అందుకే శరీరానికి తగిన కాల్షియం అందదు. అయితే ఈ రెండిటిలో ఉన్న కాల్షియం మొత్తం చియాలో ఉంటుంది. అందుకే చియా గింజలు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి తగిన కాల్షియం అందుతుంది.
మలబద్దకం తీరిపోతుంది
పిల్లల్లో మలబద్ధకం చాలా పెద్ద సమస్య. దీనికి పరిష్కారం చియా. అధికపీచు కలిగిన ఈ ఆహారం జీర్ణక్రియను సులభతరం చేయడానికి, పేగుల నుంచి విషాన్ని తొలగించడానికి సహాయపడతాయి. నెలల చిన్నారి నుంచి చియా తింటే క్యాన్సర్‌ను నివారించవచ్చంటారు ఆరోగ్య నిపుణులు. ఆరు నెలల చిన్నారుల నుంచి చియా విత్తనాలు తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందంటారు.
చర్మ ఆరోగ్యం కోసం చియా
చియా గింజలు మెరిసే చర్మం, ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ప్రతి వ్యక్తి వారానికి కనీసం రెండు మూడు సార్లు చియా తినాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గర్భిణులు కూడా ఇవి తినొచ్చు కానీ నానబెట్టి తినాలి. ఎముకల దృఢత్వానికి కూడా మంచిది. చిన్నారుల డైట్ లో ఈ విత్తనాలు చేరిస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటారు
కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి
చియా విత్తనాల్లో కరిగే ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఈ విత్తనాలు LDL కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో దోహదపడతాయి. ఒమేగా-3లు అనుకూలమైన లిపిడ్ ప్రొఫైల్‌ను ప్రోత్సహించడం ద్వారా గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. చియా విత్తనాలు శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి హృదయనాళ పనితీరుకు మరింత ప్రయోజనం చేకూరుస్తాయి. చియా విత్తనాలు అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ముఖ్యంగా ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం (ALA) ఉంటాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, గుండె ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడంలో ఒమేగా-3లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
చియా విత్తనాలు క్లోరోజెనిక్ యాసిడ్, కెఫిక్ యాసిడ్‌తో సహా యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బులకు ప్రధాన కారణమైన ఆక్సీకరణ ఒత్తిడి, వాపుతో పోరాడుతాయి. అవి ఫ్రీ రాడికల్స్‌ను తటస్తం చేయడంలో సహాయపడతాయి. మంటను తగ్గిస్తాయి, మొత్తం గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. చియా గింజలలోని కరిగే ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం