కైకలూరులో బీజేపీ హవా – వైసీపీ దూలం బలహీనమే !

కృష్ణాజిల్లాలో కైకలూరు నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. 2019లో దూలం నాగేశ్వరరావు వైసీపీ తరపున గెలిచారు. సర్పంచ్‌గా పనిచేసి.. నియోజకవర్గంలో సుపరిచతమైన నాగేశ్వరరావుకు వ్రజలు.. 2019లో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. జనం ఇచ్చిన అవకాశాన్ని సదరు ఎమ్మెల్యే ఉపయోగించుకుకోలేదనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ప్రజలకు కొత్తగా చేసిందేమే లేకపోగా.. ఆయన వల్ల ఇబ్బంది పడ్డామని కొందరు బహిరంగంగానే చెప్పడం.. వివాదస్పదంగా మారింది.

కామినేని శ్రీనివాస్ కు అనుకూల వాతావరణం

NDA అభ్యర్థిగా ఉన్న కామినేని శ్రీనివాసరావుకు మంచి పేరుంది. NDA తరుపున 2014లో ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పనిచేసిన ఆయన వైపే… ప్రజలందరూ మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. కామినేనికు సౌమ్యుడిగా పేరుంది. దానికి తోడు మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేశారని ఆయన అభిమానులు చెబుతున్నారు. పార్టీలకు అతీతంగా శ్రీనివాసరావుకు ప్రత్యేక ఓట్‌బ్యాంక్‌ ఉందని టాక్‌. పైగా.. ఆయన వల్ల ఎవరికీ ఇబ్బంది కలిగిన దాఖలాలు కూడా లేవనే ప్రచారం ఉంది. కొల్లేరు సమస్యకు కొంతమేరకు ఆయన పరిష్కారం చూపించారని సానుభూతి జనంలో ఉంది. ఏదైనా పనిమీద ఆయన దగ్గరకు వెళ్తే.. వెనువెంటనే స్పందిస్తారనే టాక్‌ నియోజకవర్గంలో ఉంది.

దూలం నాగేశ్వరరావుపై అవినీతి ఆరోపణలు

కైకలూరు ఎమ్మార్వో కార్యాలయం కట్టడానికి గ్రామాల నుంచి నాగేశ్వరరావు లక్షల్లో విరాళాలు వసూలు చేశారని ఆరోపణలున్నాయి. మరోవైపు.. ఇసుక మైనింగ్‌ను.. తన అనుచరులకు కట్టబెట్టి కోట్లు దండుకున్నారని స్థానికులే చెప్పుుకోవటం.. మైనస్‌గా మారే అవకాశాలున్నాయి. అలానే.. తన సామాజిక వర్గానికి కాని ఉద్యోగులపై.. కక్ష సాధింపు చర్యలకు దిగుతూ.. తనకు కావాల్సిన వారికి బదిలీలు చేయించారు. విలేజ్‌ కింద ఇంటి స్థలాలు మంజూరు చేయించడం.. వాటి చుట్టూ ఉన్న పొలాలను ఎమ్మెల్యే కొనుగోలు చేశారనే ఆరోపణలు నియోజకవర్గంలో చక్కెర్లు కొడుతున్నాయి. దీంతో ఆయన ఈసారి గెలిచే అవకాశాలు లేవని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు.

కామినేని గెలుపు ఖాయం

నియోజకవర్గంలో చాలామందీ దూలం నాగేశ్వరావు బాధితులేనని దీంతో ఆయనకు వ్యతిరేకంగా ఈ సారి ఓట్లు వేశారని చెబుతున్నారు. నాగేశ్వరరావు అరాచకాలపై విసుగుచెంది. NDA కూటమికే పట్టం కట్టారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అందుకే ఈ సారి కూటమి అభ్యర్థి అయిన కామినేని శ్రీనివాసరావు విజయం ఖాయమనే చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.