బీజేపీ అంటేనే తృణమూల్ కాంగ్రెస్ కు పడటం లేదు. రాజకీయ ప్రత్యర్థిగా కాకుండా… శత్రువుగా చూస్తోంది. మోదీ పేరు చేబితేనే మమతా దీదీకి వణుకు పడుతోంది. ఏదో విధంగా ఆయన్ను పశ్చిమ బెంగాల్లో అడుగు పెట్టకుండా చూడాలనుకుంటోంది.మోదీ పట్ల, బీజేపీపైనా తృణమూల్ చేసినన్ని దుష్ర్పచారాలు ఎవరూ చేసి కూడా ఉండరు…
28న రోడ్ షో చేయాలనుకుని…
ఈ నెల 28న కోల్ కతాలో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించాలని పశ్చిమ బెంగాల్ బీజేపీ ప్లాన్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంతా మజుందార్ .. స్థానిక పోలీసులకు లేఖ రాశారు. తగిన భద్రత కల్పించాలని కోరారు. అనుమతులు వచ్చిన తర్వాత ఎస్పీజీ కూడా రంగంలోకి దిగుతుందని చెప్పారు. అయితే బీజేపీ లెటర్ అందగానే బెంగాల్ ప్రభుత్వం తనదైన శైలీలో స్పందించింది. ర్యాలీ, రోడ్ షోకు అనుమతి లేదంటూ సమాధానం చెప్పింది. కోల్ కతా సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని బెంగాల్ పోలీసు శాఖ ప్రకటించింది.
బెంగాల్ పోలీసుల కల్లబొల్లి కబుర్లు….
మోదీ రోడ్ షోకు అనుమతి నిరాకరించడంపై పశ్చిమ బెంగాల్ పోలీసుల వివరణ సహేతుకంగా లేదు. 144 సెక్షన్ అమలులో ఉందంటూ బీజేపీ అభ్యర్థనను తోసిపుచ్చారు. మే 28 నుంచి జూలై 26 వరకు 60 రోజుల పాటు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని కోల్ కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ ఒక ప్రకటన విడుదల చేయడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఎన్నికల వేళ ప్రధాని మోదీ నిర్వహించే రోడ్ షో కు నిషేధాజ్ఞలు ఎలా విధిస్తారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. హింసాత్మక ఘటనలు, ప్రదర్శనలు జరిగే అవకాశం ఉన్నందున ర్యాలీలు, రోడ్ షోలు నిషేధిస్తున్నామని కోల్ కతా పోలీసులు చెబుతున్నారు. పైగా ఇలాంటివి రెగ్యులర్ గా తీసుకునే నిర్ణయాలేనంటూ వివరణ ఇవ్వడం కూడా ఇప్పుడు వివాదాస్పదమైంది.
నిన్నటి కశ్మీర్ మాదిరిగా….
కోల్ కతా పోలీసుల తీరుపై సుకాంతా మజుందార్ అభ్యంతరం చెప్పారు. కోల్ కతాను లండన్ చేసి చూపిస్తామని ప్రకటించిన సీఎం మమతా బెనర్జీ చేస్తున్నదేమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం ఆఫ్ఘనిస్థాన్ లా తయారయ్యిందని ఆయన అంటున్నారు. నిన్న మొన్నటి దాకా కశ్మీర్ ఎలా ఉండేదో ఇప్పుడు బెంగాల్ అలాగే మారిందని ఆయన ఆరోపించారు. మోదీ నాయకత్వంలోనే కశ్మీర్ రాష్ట్రాన్నే దారికి తీసుకువచ్చామని, తర్వలో బెంగాల్ కూడా గాడిలో పడుతుందని ఆయన అంటున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై మమతా దీదీ మాత్రం ఇంకా నోరు మెదపలేదు. త్వరలో ఎలాంటి ప్రకటన చేస్తారో చూడాలి…