రాత్రిపూట ఐస్ క్రీం తింటున్నారా..అయితే ఈ విషయం మీకు తెలియదేమో!

మహానగరాల్లో ఉండేవారు చీకటిపడ్డాక సరదాగా బయట తిరగడం.. అర్థరాత్రి వరకూ చక్కర్లు కొట్టి రావడం..ఆ టైమ్ లో ఐస్ క్రీం తినడం చేస్తుంటారు. అయితే ఇది ఆరోగ్యానికి మంచిదేనా? చీకటిపడ్డాక ఐస్ క్రీం తినొచ్చా?

కేలరీస్ పెరుగుతాయి
ఐస్‌క్రీమ్‌లో చక్కెర, కొవ్వు అధికంగా ఉంటాయి. రాత్రి భోజనం తర్వాత ఐస్ క్రీం తినడం వల్ల మీ మొత్తం కేలరీలు పెరుగుతాయి. ఊబకాయం పెరిగే ప్రమాదం ఉంది. మరీ ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత చల్లటి డెజర్ట్ అస్సలు తినకూడదు. ఇందులో సహజంగా ఉండే చక్కెర..రక్తంల చక్కెర స్థాయిలు పెంచుతుంది. ఈ ప్రభావం నిద్రపై పడుతుంది. జీవక్రియ మందగించినప్పుడు బరువు పెరుగుతుంది.. పడుకునే ముందు పెద్ద మొత్తంలో ఐస్ క్రీం తినడం వల్ల మీ శరీరానికి ఇబ్బంది కలుగుతుంది. నిద్రపోయేముందు ఐస్ క్రీం తింటే ఉబ్బరం, గ్యాస్, అజీర్ణంతో సహా జీర్ణ సంబంధిత రుగ్మతలు ఏర్పడతాయి. ఈ లక్షణాలు రాత్రంతా నిద్రపోవడం లేదా నిద్రకు భంగం కలిగిస్తాయి

రాత్రిపూట స్నాక్స్ కూడా వద్దు
ఐస్‌క్రీమ్‌తో సహా అర్ధరాత్రి స్నాక్స్‌ తినే అలవాటు కూడా చాలామందికి ఉంటుంది. ఇది కూడా మంచి అలవాటు కాదంటున్నారు ఆరోగ్యనిపుణులు. ఈ ప్రభావం వెంటనే కనిపించకపోయినా రాను రాను ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. అందుకే రాత్రిపూట ఐస్ క్రీం, ఆయిల్ ఫుడ్స్, కొవ్వు పెంచే స్నాక్స్ కాకుండా…తేలికపాటి ఆహారం ఎంచుకోవాలి. నట్స్, ఫ్రూట్స్ , ప్రోటీన్ , ఫైబర్ సోర్స్‌తో కొద్దిగా ఐస్ క్రీం జోడించి తినొచ్చు.

తీపి తినాలని అనిపిస్తోందా!
కొందరికి నిద్రపోయేముందు స్వీట్ తినాలని అనిపిస్తుంది. అలాంటప్పుడు తేనె, బెర్రీలతో గ్రీకు పెరుగు, చిన్న ముక్క డార్క్ చాక్లెట్ లాంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోండి. ఫ్రోజెన్ ఫ్రూట్, పెరుగుతో చేసిన ఫ్రూట్ స్మూతీస్ ప్రయత్నించండి. ఐస్‌క్రీమ్‌లో చక్కెర, కొవ్వు అధికంగా ఉంటాయి. రాత్రి భోజనం తర్వాత ఐస్ క్రీం తినడం వల్ల రోజుకు మొత్తం కేలరీలు పెరుగుతాయి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం