ఏపీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ వివాదాస్పదంగా మారింది. అవసరాల పేరిటి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సెక్యూరిటి బాండ్ల అమ్మకాల రూపంలో సేకరించిన 16 వేల కోట్ల రూపాయలు ఎలా ఖర్చుచేశారన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రతి మంగళవారం రిజర్వ్‌బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహించే ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం భారీగా రుణాలు సేకరిస్తుంది.
నెలన్నరలో రూ. 16వేల కోట్ల రుణం
నెలన్నరలోనే ఆర్బీఐ నుంచి 16 వేల కోట్లు రుణాన్ని ఏపీ ప్రభుత్వం సమీకరించింది. ఏప్రిల్, మే నెలల్లో నవరత్నాల్లో భాగంగా అనేక పథకాలకు సంబంధించి లబ్దిదారులకు నగదు బదిలీ రూపంలో చెల్లిరచాలని నిర్ణయించారు. అయితే, అది జరగలేదు. పోలింగ్‌కు ఒకటి, రెండు రోజుల ముందు చెల్లించాలన్న వ్యూహం కూడా ఎన్నికల కమిషన్ జోక్యంతో విఫలమైంది. పోలింగ్ పూర్తయిన తరువాత కూడా ఇప్పటివరకు ఎవరికీ చెల్లింపులు జరగలేదు. లబ్దిదారులకు మొత్తం 14 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా, కేవలం 1500 నుంచి 2000 కోట్ల వరకు మాత్రమే చెల్లించినట్లు అధికారులే చెబుతున్నారు.
కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారా ?
కాంట్రాక్టర్లకు కూడా భారీగానే చెల్లింపులు జరుగుతున్నాయి. అయితే వీటికి కూడా ఇతర నిధులనే ఎక్కువగా వినియోగించినట్లు సమాచారం. ప్రతి నెలా రాష్ట్ర ఖజానాకు 14 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం, కేంద్రం ఇచ్చిన నిధులు, పలు రుణాలు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా నిధులు కలిపి ఈ మొత్తం సమకూరుతుంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు వంటివి చెల్లించగా, మిగిలిన నిధులతోనే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించినట్లు చెబుతున్నారు. రిజర్వ్ బ్యాంకు నురచి సమీకరించిన 16 వేల కోట్లు ఎక్కడ, ఎలా ఖర్చు చేశారన్న విషయం తేలడం లేదు. అధికారులు కూడా దీనిపై పెదవి విప్పడం లేదు.
రోజుకు 315 కోట్లు అప్పు
రిజర్వ్‌బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను పరిశీలిస్తే రోజుకు 315 కోట్లు చొప్పున సేకరించినట్టయింది. అంటే ఇరత భారీగా సేకరించిన నిధులతో ఎన్నో పనులు చేయవచ్చని అధికారులు అంటున్నారు. అయినప్పటికీ ఈ మొత్తంలో అభివృద్ధికి కానీ, సంక్షేమం కోసం లబ్ధిదారులకు ఇచ్చింది కానీ నామమాత్రమే అని సీనియర్ అధికారులు సైతం అభిప్రాయ పడుతున్నారు. ఆర్థిక నిర్వహణ విషయంలో .. ప్రజాధనం విషయంలో అధికారులు ఇలా వ్యవహారించడం వివాదాస్పదమవుతోంది.