డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రతి ప్రాజెక్టుపైనా ప్రేక్షకులకు మంచి ఆసక్తి ఉంటుంది. సినిమా హిట్టా-ఫ్లాపా అనేది పక్కనపెడితే ప్రతి సినిమాపై ఓ బజ్ క్రియేట్ అవుతుంది. చాలామంది హీరోలకు సూపర్ సక్సెస్ లు అందించిన డైరెక్టర్ పూరీ. ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ తో బిజీగాఉన్న పూరీ తర్వాత ప్రాజెక్ట్ కోసం కింగ్ ని లైన్లో పెట్టాడట…
ముచ్చటగా మూడోసారి
కింగ్ నాగార్జున-డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్లో తెరకెక్కిన సూపర్ మూవీ యావరేజ్ టాక్ వచ్చినా..సేమ్ కాంబోలో వచ్చిన శివమణి మాత్రం బ్లాక్ బస్టర్ హిట్టైంది. నేను శివమణి నాక్కొంచెం మెంటల్ అంటూ నటనలో కింగ్ నిజంగా మెంటలెక్కించాడు. ఆ తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్లో మూవీ రాలేదు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ జోడీ రిపీట్ అవబోతోందని టాక్. ఈ మధ్యనే పూరి అన్నపూర్ణ స్టూడియో లో నాగార్జునని కలిసి స్టోరీ లైన్ వినిపించారట. కథ నచ్చడంతో నాగ్ కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇది పూరి మార్క్ యాక్షన్ స్టోరీ అని టాక్. పైగా ఈ మధ్య ఫాంటసీ స్టోరీల సందడి పెరగడంతో దీనికి ఫాంటసీ టచ్ కూడా ఉందంటున్నారు.
డబుల్ ఇస్మార్ట్ తర్వాత నాగ్ తో మూవీ
ప్రస్తుతం రామ్ హీరోగా గతంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ మూవీలో బిజీగా ఉన్నాడు పూరీ. రామ్ కి మాస్ లో సాలిడ్ క్రేజ్ తెచ్చి పెట్టిన ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గానే మేకర్స్ అవైటెడ్ టీజర్ రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ కి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది కానీ ఇంతకుమించి ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తం చేశారు మాస్ ఆడియెన్స్. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న ఈ మూవీలో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు. మణిశర్మ సంగీత దర్శకుడు. ఈ మూవీ హడావుడి పూర్తైన వెంటనే నాగ్ తో మూవీ పట్టాలెక్కనుందని టాక్.
నాగ్ కూడా బిజీ
ప్రస్తుతం నాగార్జున శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేరలో నటిస్తున్నాడు. ఈ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. దీని తర్వాత తమిళ దర్శకుడు నవీన్ తో మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడు. వీటితో పాటూ పూరీ మూవీకి కూడా డేట్స్ కేటాయించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడట నాగ్. పైగా పూరీ మూవీ అంటే ఎక్కువ రోజులు డేట్స్ కేటాయించాల్సిన అవసరం లేదు..మహా అయితే రెండు మూడు నెలల్లో షూటింగ్ పూర్తైపోతుంది. పైగా హిట్ కాంబినేషన్ కాబట్టి..శివమణి తర్వాత ఆ రేంజ్ సక్సెస్ పక్కా అని ముందే ఫిక్సైపోయారు అక్కనేని అభిమానులు..