సౌత్ లో సాయిపల్లవి క్రేజే వేరు..ఇప్పుడు నార్త్ టార్గెట్!

ఫిదా సినిమాతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది సాయిపల్లవి. కేవలం ఫిదా మాత్రమే కాదు సాయిపల్లవి నటించిన ప్రతి సినిమా అద్భుతమే. కొన్ని మూవీస్ ఫ్లాప్ టాక్ వచ్చినా సాయిపల్లవి నటనకు ఫుల్ మార్కులు పడ్డాయి. ఇప్పటికే సౌత్ క్రేజ్ పెంచుకున్న సాయిపల్లవి ఇప్పుడు నార్త్ లో అదే ప్రయత్నంలో ఉంది…

టాలీవుడ్ ఇండస్ట్రీలో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ వేరు. ఫస్ట్ మూవీతోనే ఫాలోయింగ్ పెంచుకున్న ఈ బ్యూటీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటుంది. కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తుంది..తనకంటూ ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టర్స్ మాత్రమే చేస్తుంది. అందుకే తక్కువ మూవీస్ లో నటించినా స్టార్ హీరోయిన్ రేంజ్ కి చేరుకుంది. అయినప్పటికీ ఎప్పుడూ సింపిల్ గానే కనిపిస్తుంది సాయిపల్లవి. టాలీవుడ్ లో వెలుగుతున్న సాయిపల్లవి ఇప్పుడు బాలీవుడ్ లోనూ అదే ప్రయత్నంలో ఉంది. ఇందులో భాగంగా రణబీర్ కపూర్ తో కలసి రామాయణం మూవీలో నటిస్తోంది. సీతగా సాయిపల్లవిని చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఈ మూవీకి సైన్ చేసిన తర్వాత సాయిపల్లవి క్రేజ్ పెరిగిపోయిందనే చెప్పాలి. గతంలో ఎంత పాపులార్టీ ఉండేదో ఇప్పుడు అంతకు డబుల్ అయింది. ఈ సినిమా సూపర్ హిట్టైతే చాలు పాన్ ఇండియా రేంజ్ లో వెలుగుతుంది.

ల‌వ్ స్టోరీ త‌ర్వాత నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి కాంబోలో వ‌స్తోన్న సెకండ్ మూవీ తండేల్. చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూరల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టొరీగా తండేల్‌ తెర‌కెక్కుతోంది. ఇందులో నాగ‌చైత‌న్య ఓ జాల‌రి పాత్ర‌లో , ప‌ల్లెటూరి అమ్మాయిగా సాయిప‌ల్ల‌వి నటిస్తున్నారు. చేప‌ల వేట‌కు వెళ్లి అనుకోకుండా దేశ స‌రిహ‌ద్దులు దాటిన ఓ యువ‌కుడు పాకిస్థాన్ సైన్యానికి ఎలా బందీగా చిక్కాడు? పాకిస్థాన్ జైలు నుంచి త‌ప్పించుకునే క్ర‌మంలో ఎలాంటి అడ్డంకులు ఎదుర‌య్యాయి? శ‌త్రు దేశానికి చిక్కిన త‌న ప్రియుడిని కాపాడుకోవ‌డానికి ఓ యువ‌తి ఎలాంటి సాహ‌సానికి సిద్ధ‌ప‌డింద‌నే అంశాల‌తో తండేల్‌ తెర‌కెక్కుతోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. నాగ‌చైత‌న్య కెరీర్‌లో భారీ బ‌డ్జెట్ మూవీస్‌లో ఒక‌టిగా తండేల్ తెర‌కెక్కుతోంది. 2024 డిసెంబ‌ర్ 20న తండేల్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో విడుదలవుతోన్న ఈ మూవీ ఓటీటీ హక్కులు 40 న‌ల‌భై కోట్ల‌కు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

మొత్తానికి టాలీవుడ్ లో తండేల్, బాలీవుడ్ లో రామాయణం…ఈ రెండు సినిమాలు సక్సెస్ అయితే సాయిపల్లవి రేంజ్ మరింత పెరిగిపోవడం పక్కా…