ఐదో విడత బీజేపీకి కేక్ వాక్ – ఇండి కూటమికి కష్టకాలమే !

కేంద్రంలో అధికారాన్ని ఉత్తరప్రదేశ్‌ నిర్ణయిస్తుంది. 2014, 2019 ఎన్నికల్లో యుపిలో బిజెపి ఎక్కువ సీట్లను సొంతం చేసుకుంది. రాష్ట్రంలోని మొత్తం 80 లోక్‌సభ స్థానాలకు గానూ 2014 ఎన్నికల్లో 71 స్థానాలను, 2019లో 62 స్థానాలను బిజెపి కైవసం చేసుకుంది. ఈసారి కూడా బిజెపికి ఎదురు లేకుండా పోయింది. పార్టీలన్నీ బలహీనపడటంతో కమల వికాస పూర్తి స్థాయిలో జరిగేందుకు రంగం సిద్ధమయింది.

అమేథీ, రాయ్ బరేలీల్లో పోలింగ్

కాంగ్రెస్‌ కంచుకోటలైన అమేథీ, రాయ్ బరేలీ స్థానాలకు ఈ దశలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 20న యుపిలో 14 స్థానాలకు జరగనున్న ఐదో దశ ఎన్నికలు కీలకంగా మారాయి. ఈ 14 స్థానాల్లో గత ఎన్నికల్లో బిజెపి ఏకంగా 13 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతోపాటు రాజ్‌నాథ్‌ సింగ్‌, స్మృతి ఇరానీ సహా ఐదుగురు కేంద్ర మంత్రులు ఈ దశలో బరిలో ఉన్నారు. రాహుల్‌ గాంధీ పోటీ నుంచి తప్పుకొని రారుబరేలీ నుంచి బరిలో నిలిచారు. అమేథీలో కాంగ్రెస్‌ తరపున కెఎల్‌ శర్మ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై పోటీ చేస్తున్నారు. రారుబరేలీలో రాహుల్‌ గాంధీపై బిజెపి అభ్యర్థిగా దినేశ్‌ ప్రతాప్‌ సింగ్‌ పోటీలో ఉన్నారు.

అన్ని చోట్లా బీజేపీ ఆధిపత్యం

ఐదో దశలో ఎన్నికలు జరుగుతున్న స్థానాల్లో లక్నో నుంచి రాజ్‌నాథ్‌ సింగ్‌ మూడోసారి పోటీ చేస్తున్నారు. ఆయనపై ఎస్‌పి అభ్యర్థిగా రవిదాస్‌ మల్హోత్రా బరిలో ఉన్నారు. మోహన్‌లాల్‌గంజ్‌ నుంచి మరో కేంద్ర మంత్రి కౌశల్‌ కిశోర్‌ పోటీ చేస్తుండగా, ఆయనకు ఎస్‌పి అభ్యర్థిగా ఆర్‌కె చౌదరి గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. జలౌన్‌ స్థానం నుంచి కేంద్ర మంత్రి భానుప్రతాప్‌ సింగ్‌ వర్మ ఆరోసారి విజయం కోసం ప్రయత్నిస్తున్నారు. ఫతే పూర్‌ నుంచి మరో కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్‌ జ్యోతి పోటీ చేస్తుండగా, ఆమెకు ఎస్‌పి కీలక నేత నరేశ్‌ ఉత్తమ్‌ పటేల్‌ ప్రత్యర్థిగా బరిలో నిలిచారు. బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ కుమారుడు కరణ్‌ భూషణ్‌ కైసర్‌గంజ్‌ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనపై ఎస్‌పి అభ్యర్థిగా భగత్‌రామ్‌ మిశ్రా పోటీ చేస్తున్నారు. ఆయనకు నియోజకవర్గంలో ఎదుుర లేదు.

కాంగ్రెస్ యువరాజు గెలుస్తాడా ?

రాయ్ బరేలీ నుంచి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ పరిస్థితి గందరగోళంగా ఉంది. అందుకే సోనియా గాంధీ సెంటిమెంట్ పండించారు. తన కుమారుడు రాహుల్ గాంధీకి అండగా నిలవాలని రాయబరేలీ ఎంపీ నియోజకవర్గం ప్రజలను కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ కోరారు. ‘మా కుటుంబం మూలాలు ఈ నేలతో ముడిపడి ఉన్నాయి. మీ ప్రేమతో నాకు ఎప్పుడూ నేను ఒంటరిని అనే భావన కలగలేదు. నా కుమారుడిని మీకు అప్పగిస్తున్నాను అంటూ చేసిన సెంటిమెంట్ రాజకీయం వారి బలహీతనను బయట పెట్టింది.