ఆ 3 సినిమాలు వరుణ్ ఖాతాలో పడి ఉంటే కెరీర్ మరోలా ఉండేదా!

హ్యాపీ డేస్ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో వరుణ్ సందేశ్ టాలీవుడ్ లో యంగ్ ప్రామిసింగ్ హీరో అనిపించుకున్నాడు. వరుస మంచి కథలు పలకరించాయి. అందుకు తగ్గట్టుగానే సూపర్ హిట్స్ అందుకున్నాడు. కొత్తబంగారులోకం మూవీ యూత్ ఫుల్ లవ్ స్టోరీగా ఓ ఊపు ఊపింది. కుర్రాడు మూవీ సహా వరుణ్ చేసిన ప్రాజెక్టులన్నీ దాదాపు బాగానే ఉన్నాయి అనిపించుకున్నాడు. కానీ ఎక్కడో తేడా కొట్టింది.. అంతే ఒక్కసారిగా గ్యాప్ పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా వరుణ్ కోసం రాసుకున్న కొన్ని కథలు అనుకోకుండా మరో హీరోకి వెళ్లిపోయాయి.. కారణాలు ఏమైనా కానీ వరుణ్ సందేశ్ ఆ మూవీస్ లో నటించి ఉంటే ఇప్పటికీ ఫుల్ ఫామ్ లో ఉండేవాడు అని చెప్పుకోవచ్చు.. ఆ సినిమాలేంటంటే…

100% లవ్
నాగ చైతన్య సూపర్ హిట్ మూవీ 100 పర్సెంట్ లవ్ స్టోరీ ముందుగా వరుణ్ సందేశ్ ని ఉద్దేశించి రాసుకున్నారట. వరుణ్ హీరోగా కూడా కన్ఫామ్ అయ్యాడు. కానీ ఆ మూవీ నాగచైతన్య చేతుల్లోకి వెళ్లింది. అసలు వరుణ్ ని అడిగిన తర్వాత ఎందుకు పక్కనపెట్టారో అర్థం కాలేదట..

గుండె జారి గల్లంతయ్యిందే
నితిన్-నిత్యామీనన్ నటించిన గుండెజారి గల్లంతయ్యిందే మూవీ సూపర్ సక్సెస్ అందుకుంది. మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇష్క్ తో ఫామ్ లోకి వచ్చిన నితిన్ కి ఈ మూవీ మరింత ఊపిరిపోసింది. వాస్తవానికి ఈ మూవీ స్టోరీ కూడా వరుణ్ సందేశ్ ని ఉద్దేశించి రాసుకున్నారట. ఆ తర్వాత నితిన్ చేతుల్లోకి వెళ్లింది..

భీమిలి కబడ్డీ జట్టు
నాని మూవీ భీమిలి కబడ్డీ జట్టు కూడా వరుణ్ చేతుల్లోంచి చేజారిన మూవీయేనట. ఈ సినిమా సూపర్ హిట్ కాకపోయినా బావుంది అనిపించుకుంది.

తండ్రే కారణమా?
వరుణ్ కెరీర్ ఇలా అవడానికి తన తండ్రే కారణం అని టాక్. కథ, కథనాలను పట్టించుకోకుండా పెద్ద బ్యానర్ అయితే చాలు డేట్స్ కేటాయించేలా కొడుకుని ఒప్పించారట. అలా వరుణ్ కి వరుస ఫ్లాప్ మూవీస్ పడ్డాయ్. ఇంకేముందు సైలెంట్ గా సైడైపోవాల్సి వచ్చింది. అయితే వరుణ్ సందేశ్ మాత్రం అదేం కారణం కాదు..తన టైమ్ బాలేదంతే…తండ్రే తనకు ఇన్సిపిరేషన్ అంటాడు.

మొత్తానికి వరుణ్ చేతుల్లోంచి చేజారిన 100% లవ్, గుండెజారి గల్లంతయ్యిందే, భీమిలి కబడ్డీ జట్టులో తనే నటించి ఉంటే ఇప్పుడు లెక్క మరోలా ఉండేదమో.. గడిచిన సంగతి సరే ఫ్యూచర్ కోసం ఆల్ ది బెస్ట్ వరుణ్ సందేశ్ అంటున్నారు సినీ ప్రియులు…