ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి గెలుపు కోసం అన్ని పార్టీల నేతలు విస్తృతంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు పార్టీలో లభిస్తున్న అవకాశాలతో సంబంధం లేకుండా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డికి హెలికాఫ్టర్ కూడా కేటాయించారు. పలు నియోజవకర్గాల్లో విస్తృత పర్యటనలు నిర్వహిస్తున్నారు. విజయవాడ ర్యాలీకి వచ్చిన మోదీకి గన్నవరం ఎయిర్ పోర్టులో ప్రత్యేకంగా స్వాగతం పలికారు.
ప్రధాని మోదీకి స్వాగతం పలికిన విష్ణువర్ధన్ రెడ్డి
ఏపీ బీజేపీకి ఉపాధ్యక్షునిగా ఉన్న విష్ణువర్దన్ రెడ్డి గన్నరవం ఎయిర్ పోర్టులో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. విజయవాడలో కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షో సమన్వయ బాధ్యతలను కూడా విష్ణువర్ధన్ రెడ్డిపంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో మోదీకి స్వాగతం చెప్పేందుకు సీనియర్
నేతల్లో ఆయన కూడా ఉన్నారు. జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి మోదీ ప్రచార కార్యక్రమాల్లో సమన్వయం చేసిన రికార్డు విష్ణువర్ధన్ రెడ్డికి ఉంది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బెంగళూరులో జరిగిన మోదీ రోడ్ షోలను కూడా సమన్వయం చేసుకున్నారు.
ప్రచారం కోసం హెలికాప్టర్ కేటాయింపు
బీజేపీ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో విష్ణువర్ధన్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు రెండు రోజుల పాటు హెలికఫ్టర్ కేటాయించినట్లుగా తెలుస్తోంది. ధర్మవరం అసెంబ్లీ, రాజంపేట పార్లమెంట్ తో పాటు బద్వేలు నియోజకవర్గాల్లో విష్ణువర్ధన్ రెడ్డి తెర వెనుక.. తెర ముందు వ్యూహాల్లో కీలక పాత్ర పోషించారు.
బీజేపీలో సీనియర్లందరికీ ప్రత్యేక బాధ్యతలు
బీజేపీలో సీట్ల కోసం పోటీ ఉంటుంది కానీ.. ఒక సారి సీట్లు ఫైనల్ అయిన తర్వాత ఎవరి బాధ్యతలు వారికి ఉంటాయి. సీట్లు రాని వారు కూడా మొత్తం మర్చిపోయి… సీట్లు వచ్చిన వారి కోసం కృషి చేస్తూంటారు. ఎవరి బాధ్యతలకు తగ్గట్లుగా వారికి పార్టీ ప్రచారం అప్పగిస్తుంది. సీనియర్ నేతలకు హెలికాఫ్టర్ సౌకర్యం కల్పిస్తుంది.