విజయ్ దేవరకొండకు ఇకపై గుడ్ టైమ్ మొదలవుతుందా!

చిన్న చిన్న క్యారెక్టర్స్ తో కెరీర్ ఆరంభించి తనకంటూ స్పెషల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు రౌజీ హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డితో టర్న్ అయిన కెరీర్..గీతగోవిందంతో పూర్తిగా సెట్టైపోయింది….అయితే ఈ మధ్య రౌడీ హీరోకి టైమ్ కలిసొస్తున్నట్టు లేదు..అందుకే రెమ్యునరేషన్ కూడా తగ్గిపోతోందట. మే 9 విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా తన ఫ్యూచర్ ప్రాజెక్టులపై అప్ డేట్స్ రానున్నాయి. తన ఫ్యూచర్ ని డిసైడ్ చేసేది కూడా ఈ మూడు సినిమాలే…

లైగర్ కారణంగా తగ్గాల్సి వచ్చింది!
విజయ్ దేవరకొండ కెరీర్లో హిట్స్ కన్నా ఫ్లాపులే ఎక్కువ..అయినప్పటికీ ప్రేక్షకుల్లో తనకుంటూ స్పెషల్ క్రేజ్ ఉంది. సినిమాలు వేరు అభిమానం వేరు అని ఫ్యాన్స్ ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. వాస్తవానికి ‘లైగర్’ మూవీతో ఎక్కడికో వెళ్లిపోతానని ఫిక్సయ్యాడు..పాన్ ఇండియా స్టార్ అయిపోతాను అనుకున్నాడు..భారీ అంచనాల మధ్య ఆ మూవీ వచ్చింది. కానీ ఊహించని డిజాస్టర్ ఇచ్చింది. కెరీర్ పరంగా ఒక్కసారి డౌన్ చేసేసింది. దీంతో పాన్ ఇండియా స్టార్ మళ్లీ సౌత్ ఇండియానేక పరిమితమయ్యాడు.

నిరాశ పర్చిన ఫ్యామిలీ స్టార్
రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా సక్సెస్ అవుతుంది అనుకుంటే అది కూడా సోసోగానే నడిచింది. అయితే లైగర్ కన్నా బెటర్ మార్కులు సొంతం చేసుకుంది. వరుస ఫ్లాపులు రావడంతో విజయ్ కెరీర్ డల్ అవడంతో పాటూ రెమ్యునరేషన్ విషయంలోనూ తగ్గకతప్పడం లేదు. 25కోట్లు ఇస్తానని చెప్పి రెండు సినిమాలకు బుక్ చేసుకున్నాడట దిల్ రాజు. వాస్తవానికి మీడియం బడ్జెట్ హీరో అయిన విజయ్ కు అది తక్కువ మొత్తమే కానీ..కెరీర్ పరంగా తగ్గక తప్పలేదు.

3 ప్రాజెక్టులతో బిజీ
ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో ఓ భారీ మూవీ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ మూవీలో విజయ్ సరసన ప్రేమలు హీరోయిన్ మమిత బైజు, భాగ్యశ్రీ బోర్స్ లలో ఒకరు నటిస్తారని టాక్. అనిరుధ్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. గతంలో రాహుల్‍తో విజయ్ చేసిన ట్యాక్సీవాలా మంచి విజయాన్నే సాధించింది. మరోసారి వీరి కాంబో రిపీట్ అవుతోంది. విజయ్ దేవరకొండతో రాహుల్ చేయబోయే మూవీ రాయలసీమ బ్యాక్‍డ్రాప్‍లో పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఉండనుంది. ఫ్యామిలీ స్టార్ తర్వాత దిల్‍రాజు బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌తో మరో మూవీకి కమిటయ్యాడు విజయ్ దేవరకొండ.

మొత్తానికి ఈ 3 సినిమాల సక్సెస్ పై విజయ్ దేవరకొండ ఫ్యూచర్ ఆధారపడి ఉందన్న మాట..ఏం జరుగుతుందో చూద్దాం…