ఏపీ ఎన్నికల్లో జాతీయ జనసేన – గుర్తు బకెట్ ! జనసేనకు టెన్షన్

అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాలు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది అన్న విధంగా వేడెక్కాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు గెలిపే లక్ష్యంగా దూసుకుపోతున్నాయ్. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఒకచోట కూడా గెలవ లేకపోయిన పవన్ కళ్యాణ్ ఇక ఈసారి పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి బరీలోకి దిగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రజల తరఫున పోరాటం చేసేందుకు రెడీ అవుతున్నారు. తనను ఒక్కసారి గెలిపించి చూడండి నేనేంటో చూపిస్తా అంటూ ఇక ప్రచార రంగంలో దూసుకుపోతున్నారు.

బరిలో జాతీయ జనసేన – అధ్యక్షుడి పేరు పవన్ కల్యాణ్

ఇలాంటి సమయంలో జనసేనని పవన్ కళ్యాణ్ కు మాత్రం చిక్కులు తప్పడం లేదు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు ఎన్నికల్లో ఓట్ల సంఖ్యను తగ్గించేలా మరో కొత్త చిక్కు వచ్చి పడింది అనేది తెలుస్తుంది.
తెలంగాఆణ అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్ పల్లిలో జనసేన పోటీ చేసింది. అదే సమయంలో జాతీయ జనసేన అనే పార్టీ కూడా ఒకటి పోటీ చేసింది. పట్టు బట్టి మరీ బక్కెట్ గుర్తును తెచ్చుకున్నారు. జనసేన పేరు గుర్తుకు తెచ్చేలా జాతీయ జనసేన అని పేరు పెట్టుకున్నారు. గ్లాస్ గుర్తుకు పోలికగా ఉండేలా బకెట్ తెచ్చుకున్నారు. దాదాపుగా ఎనిమిది వందల ఓట్లను కూకట్ పల్లిలో ఆ పార్టీ చీల్చింది.

గ్లాస్ గుర్తు ఉండేలా బకెట్ గుర్తు

జాతీయ జనసేన పార్టీ ఇప్పుడు ఏపీకి వచ్చేసింది. పేరు, గుర్తు మాత్రమే కాదు.. ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడి పేరు కూడా సిమిలర్ గా ఉండేలా చూసుకున్నారు. ఎలా అంటే… కొణిదెల పవన్ కల్యాణ్‌కు దగ్గరగా ఉండేలా.. కొనింటి పవన్ కల్యాణ్ అనే వ్యక్తిని వెదుక్కుని అధ్యక్షుడిగా ప్రకటించేశారు . జనసేన పార్టీకి .. జాతీయ జనసేన, గ్లాస్ గుర్తుకు బకెట్, కొణిదెల పవన్ కల్యాణ్ పేరుకు.. కోనింటి పవన్ కల్యాణ్ .. ఇలా అన్నింటికీ సిమిలర్ గా ఉండే రాజకీయం ఏపీలో నడుస్తోంది.

పవన్ కు అనేక సమస్యలు

ఓ వైపు ఇండిపెండెంట్లకు గ్లాస్ గుర్తు కేటాయించాలని నిర్ణయించారు. మరో వైపు బకెట్ గుర్తు.. జాతీయ జనసేన .. పేరు ఇలా అన్ని రకాల సమస్యలు చుట్టుముడుతున్నాయి ఓట్లు చీలిపోకూడదని పొత్తులు పెట్టు