బరువు తగ్గేందుకు, శరీరం తేలికగా ఉండేందుకు వాకింగ్ చేస్తుంటారు. అయితే కొందరు ఉదయాన్నే వాకింగ్ చేస్తే మరికొందరు సాయంత్రం.. ఇంకొందరు రాత్రి భోజనం తర్వాత నిద్రకు ఉపక్రమించే ముందు నడుస్తారు. ఉదయం, సాయంత్రం వాకింగ్ సంగతి సరే..మరి రాత్రి భోజనం తర్వాత వాకింగ్ మంచిదేనా?
భోజనం తర్వాత వాకింగ్ చేస్తే!
రోజూ రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకోవడం కం ముుందు వాకింగ్ చేస్తే చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. భోజనం చేసిన తరువాత వెంటనే పడుకోవడం వల్ల జీర్ణ సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి. కనుక భోజనం చేసిన తరువాత వాకింగ్ చేయడం వల్ల జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయంటున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు…
వేగంగా నడవొద్దు
కొందకు వాకింగ్ వేగంగా చేస్తే మరికొందరు నెమ్మదిగా నడుస్తారు. అయితే రాత్రిపూట భోజనం చేసిన వెంటనే వాకింగ్ చేయకూడదు. భోజనం చేసిన ఒక గంట తరువాత వాకింగ్ చేయాలి. అలాగే ఈ వాకింగ్ వేగంగా కూడా చాలా నెమ్మదిగా నడుస్తూ చేయాలి. వేగంగా నడవడం వల్ల కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. నెమ్మదిగా ఓ అరగంటసేపు నడిస్తే మంచిది.
ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో
రాత్రి భోజనం చేసిన తరువాత వాకింగ్ చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. రాత్రి భోజనం చేసిన తరువాత నడవడం వల్ల శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది. శరీర బరువు అదుపులో ఉంటుంది. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇన్పెక్షన్ లు, సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. అలాగే రాత్రి భోజనం చేసిన తరువాత నడవడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ ను మెదడుకు ప్రశాంతతను కలిగిస్తుంది. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. దీంతో మనకు నిద్ర చక్కగా పడుతుంది. కుటుంబ సభ్యులతో లేదా జీవిత భాగస్వామితో కబుర్లు చెప్పుకుంటూ నడవడం వల్ల శరీర ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది..
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.