సార్వత్రిక ఎన్నికలలో తంబళ్లపల్లి నియోజకవర్గం టిడిపి, జనసేన, బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డికే టిడిపి బి.ఫారం ఇవ్వడంతో నియోజకవర్గంలోని టిడిపి శ్రేణులు, ప్రజల ఉత్కంఠకు తెరపడింది. టిడిపి,జనసేన, బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పారిశ్రామికవేత్త దాసరిపల్లి జయచంద్రారెడ్డిని తంబ ళ్లపల్లి నియోజకవర్గం టిడిపి అభ్యర్థిగా అధిష్టానం ఎంపిక చేసిం ది.
బీఫాం ఇచ్చేందుకు ఊగిసలాడిన చంద్రబాబు
కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి బి.ఫారం ఇచ్చే విషయంలో టిడిపి అధినేత చంద్రబాబు ఆలస్యం చేయడం, దీనికి తోడు తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి టిడిపి టిక్కెట్‌ను ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్, పారిశ్రా మికవేత్త కొండా నరేం ద్రలు తెలుగుదేశం పార్టీ టికెట్ తమకు కేటాయించాలని ప్రయత్నాలు చేస్తూ టిడిపి ప్రధాన కార్యాల యం వద్ద తిష్ట వేయడంతో బి.ఫారం ఇచ్చే విషయంలో ఆలస్యం చేస్తూ వచ్చింది. తంబళ్లపల్లి నియోజకవర్గ టిడిపి స్థానాన్ని మారుస్తున్నట్లు ప్రచారాలు జోరుగా కొనసా గాయి.
నామినేషన్ వేసి సీరియస్ ప్రచారం చేసుకున్న జయచంద్రరెడ్డి
తంబళ్లపల్లి నియోజకవర్గం టిడిపి అధిష్టానం బి.ఫారం ఎవరికి ఇస్తుందని టికెట్ ఎవరికి కేటాయి స్తుందనే విషయంలో ఇటు టిడిపి శ్రేణులలో, ప్రజలలో ఉత్కంఠ నెలకొంది. బుధవారం టిడిపి అధిష్టానం ఎంపిక చేసిన దాసరిపల్లి జయచంద్ర రెడ్డికి టిడిపి ప్రధాన కార్యాలయం నుంచి బి.ఫారం అందించడంతో దాసరిపల్లి జయచంద్రారెడ్డి పోటీలో నిలు స్తున్నట్లు ఖరారైంది. బయట ఎంత ప్రచారం జరుగుతున్నా ఆయన మాత్రం సీరియస్ గా భారీ ర్యాలీతో నామినేషన్ వేసి ప్రచారం చేసుకుంటున్నారు. మార్చినా ఆయన ఇండిపెండెంట్ గా కొనసాగే ప్రమాదం ఉండటంతో ఆయనకే బీఫాం ఇవ్వడం మంచిదని నిర్ణయానికి వచ్చారు.
గందరగోళంతో టీడీపీకి నష్టమే
ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీకాకుళంలో ఉన్న చంద్రబాబు ను జయ చంద్రారెడ్డి, నియోజకవర్గం సమన్వయకర్త సీడ్ మల్లికార్జున నాయుడులు కలిశారు. తనపై నమ్మకం ఉంచి టిడిపి టికెట్ కేటాయించి, బి.ఫారం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడుకి కతజ్ఞతలు తెలి పారు. నియోజకవర్గంలో అందరి సహకారంతో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోస్తానని చెప్పారు. కానీ బీఫాం గందరగోళంతో పార్టీకి చాలా నష్టం జరిగిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.