బాక్సాఫీస్ దగ్గర ప్రతినిధి-2 రీసౌండ్ గట్టిగానే వినిపించేట్టుంది!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నారా రోహిత్ – ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తాపు కాంబినేషన్లో వస్తోన్న మూవీ ప్రతినిధి-2. పదేళ్ల క్రితం సన్షేషనల్ హిట్ అందుకున్న ప్రతినిధికి సీక్వెల్ గా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న మూవీ ఇది. ఏప్రిల్ 25న థియేటర్లలో సందడి చేయనున్న ఈ మూవీ రీసౌండ్ బాక్సాఫీస్ దగ్గర గట్టిగానే వినిపించేట్టుంది…

రోహిత్ అకౌంట్లో హిట్ పక్కానా!
కథల ఎంపికలో విభిన్నంగా ఆలోచించే నారారోహిత్ ఆ మధ్య వరుస మూవీస్ చేసి చిన్న బ్రేక్ తీసుకుని ప్రతినిధి 2తో వస్తున్నాడు. పదేళ్ల క్రితం ప్రతినిధి మూవీ రిలీజైన రోజే ఇప్పుడు ప్రతినిధి 2 కూడా విడుదలవుతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదల చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ ఒకదాన్ని మించి మరొకటి భారీ అంచనాలు పెంచుకుంటూ వెళ్లాయి. ముఖ్యంగా ట్రైలర్లో డైలాగ్స్ థియేటర్లో గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి.

@ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ చనిపోయినప్పుడు ఎంత మంది గుండెలు ఆగిపోయాయ్?
@ జనం కోసం బతికితే చచ్చాక కూడా జనంలో బతికే ఉంటాం
@ రాష్ట్రం అప్పు తీర్చేందుకు ఎంత టైమ్ పడుతుందంటే – అభివృద్ధి ఉంటే ఎంతసేపు అనే రియాక్షన్… వెంటనే అభివృద్ధా అదెక్కడుంది సర్ అనే డైలాగ్ బాగా పేలింది.
@ రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే రాజకీయ నాయకుల ఆస్తులు ఎందుకు పెరుగుతున్నాయ్?
@ అక్షరాలు మార్చకుండా న్యూస్ రాసినప్పుడు కచ్చితంగా మార్పు వస్తుంది
@ ఒళ్లు విరిచి బయటకు వచ్చి ఓటేయండి లేదంటే దేశం వదిలి వెళ్లిపోండి..కుదరకపోతే చచ్చిపోండి..

ఇంకా చెప్పుకుంటే రోహిత్ ఇంటెన్స్ యాక్టింగ్ కి ఫుల్ మార్కులు పడితే…దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే ప్రముఖ జర్నలిస్ట్ మూర్తికి డబుల్ సెంచరీ మార్కులొచ్చాయి. రీసెంట్ గా విడుదలైన ‘గల్లా ఎత్తి నిజం చెప్పే హీరోలకు సలాం కొట్టు’ అనే సాంగ్ కి కూడా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. పైగా స్క్రీన్ మొత్తం నటులను నింపేయడం కాదు..వాళ్లకు తగిన క్యారెక్టర్ ఇవ్వగలగేలా ఉండాలి… ప్రతినిధి 2 లో నటించిన ప్రతి నటుడికి ప్రత్యేకమైన సీన్లు, డైలాగ్స్ కేటాయించినట్టు ట్రైలర్ చూసినప్పుడే అర్థమవుతుంది… ఇంద్రజ, ఉదయభానుకి ఇది మంచి అవకాశమే…

రైట్ టైమ్ లో పైట్ డెసిషన్
వాస్తవానికి ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి అయినా రిలీజ్ డేట్ పై పెద్ద డిస్కషన్స్ జరుగుతున్నాయ్. ఆ సినిమా వస్తుంది ఈ సినిమా వస్తుంది వాయిదా వేద్దామా? పోటీగా దిగుదామా? అని…కానీ ప్రతినిధి 2 విషయంలో అలాంటివేమీ లేవు…మొదట్నుంచీ భారీ హడావుడి చేయలేదు. సినిమా పూర్తైన వెంటనే డైరెక్ట్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు. కలిసొచ్చిన విషయం ఏంటంటే ప్రతినిధి 2 విడుదలవుతున్న డేట్ కి ముందు-వెనుక భారీ సినిమాలేవీ లేనేలేవు…సో..థియేటర్లు భారీగానే దొరుకుతాయి. పైగా సమ్మర్ హాలిడేస్ మొదలైన వెంటనే వస్తోన్న సినిమా. అన్నిటికన్నా … దేశంలో ఎండ వేడితో పాటూ పొలిటికల్ హీట్ నడుస్తున్న టైమ్ లో వస్తోన్న పక్కా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ.

రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్టైంది కాబట్టి..ప్రమోషన్ జోరు పెంచితే ఓపెనింగ్స్ భారీగా వస్తాయ్. పాజిటివ్ మౌత్ టాక్ వస్తే ఈ సమ్మర్ కి ప్రతినిథి 2 నే హీరో..