శ్రీరామ నవమి దగ్గరపడుతోంది. అయోధ్యలో బాలరాముడి దర్శనార్థం భక్తులు పోటెత్తుతున్నారు. అయోధ్యలో రామయ్య కొలువుతీరినప్పటి నుంచీ కానుకలు కూడా వెల్లువెత్తున్నాయి. తాజాగా ఓ భక్తులు అద్భుతమైన కానుక ఇచ్చాడు…
బంగారు రామాయణం
అయోధ్య రాముడికి ఓ భక్తుడు కోట్ల రూపాయల విలువ చేసే 7 కిలోల బంగారంపై రాసిన రామాయణాన్ని కానుకగా ఇచ్చాడు. 500 బంగారు పేజీలపై రాసిన ఈ రామాయణాన్ని అయోధ్య ప్రధాన గర్భాలయంలో ఉంచారు. అయోధ్యలో బాల రాముడు ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత విశ్రాంత IAS అధికారి లక్ష్మీ నారాయణ తన జీవిత కాలంలో సంపాదించిన మొత్తాన్ని బాల రాముడికి ఇస్తానని ప్రతిజ్ఞ చేశారు…ఆ మాట ప్రకారం రూ. 5 కోట్లు ఖర్చుతో 151 కిలోల బరువున్న రామచరిత రామాయణాన్ని తయారు చేశారు. ప్రతి పేజీపై 24 క్యారెట్ల బంగారు పూత పూశారు.
ఇప్పటికే ప్రారంభమైన రామనవమి వేడుకలు
రామమందిరంలో ఉగాది రోజున కలశ స్థాపనతో 9 రోజుల శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమయ్యాయి. బాలరాముడ్ని పీతాంబరాలు, పట్టువస్త్రాలతో అలంకరించారు. 11 మంది వేదపండితులు తొమ్మిది రోజుల పాటు వాల్మీకి రామాయణంలోని నవ పారాయణం, రామరక్షస్తోత్ర, దుర్గాసప్తసతిని పారాయణం చేస్తున్నారు. దీంతో పాటు దశరథ్ మహల్, బడా భోక్తామల్ గార్డెన్, రామ్ వల్లభ కుంజ్, సియారామ్ కోట సహా ఇతర ఆలయాల్లో రామకథను చెబుతున్నారు. పవిత్రోత్సవం సందర్భంగా రామమందిరంలో ప్రతిష్ఠించిన రాముడి విగ్రహానికి సంబంధించిన నగలను లక్నోలోని హర్షహైమల్ షియామ్లాల్ జ్యువెలర్స్ రూపొందించింది.
30 లక్షల మంది భక్తులు దర్శించుకుంటాని అంచనా
శ్రీరామనవమి రోజు రాముడిని దర్శించుకోవాడానికీ దాదాపు 20 లక్షల నుంచి 30 లక్షల మంది వరకు హాజరు కానున్నట్టు అంచనా. కలియుగంలో తను పుట్టిన అయోధ్యలో కొలువు తీరడానికి ఐదు వందల యేళ్లు పోరాటాలు చేయాల్సి వచ్చింది. సుదీర్ఘంగా కొనసాగిన ఈ ప్రస్థానం జనవరి 22 ప్రాణ ప్రతిష్ఠతో ముగిసింది. ఓ రకంగా చెప్పాలంటే కలియుగంలో జరిగిన అతిపెద్ద మహా క్రతువుగా అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ఠను చెప్పుకోవాలి. జనవరి 23 నుంచి నుండి సామాన్య భక్తులకు రామ్ లల్లా దర్శనం అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి దాదాపు రెండు కోట్లకు పైగా భక్తులు అయోధ్య రాముడిని దర్శించుకున్నారు.