ఎన్నికలు దగ్గర పడే కొలది కాకినాడ జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండడంతో ఇక్కడి రాజకీయాలు ఆశక్తిగా మారాయి. సీనియర్ నాయకురాలు వంగా గీత, పవన్ కళ్యాణ్ మధ్య పోటీ నెలకొనడంతో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాఫిక్ గా మారింది. దీంతో అటు అధికార వైసిపి, ఇటు కూటమి నేతలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ను ఓడించే లక్ష్యంగా అధికార పార్టీ ప్రణాళికలు వేస్తోంది. ఈ నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్‌ను పెట్టింది.
పవన్ నమ్ముకున్న కాపు నేతలు వైసీపీ వైపు
సామాజికవర్గాల వారీగా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు, పరిస్థితులను సానుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నాలను ప్రారంభిం చింది. ఈ నియోజకవర్గంలో 90 వేలకు పైగా కాపు సామాజిక వర్గ ఓటర్లు ఉండడంతో వాటిపైనే ఆశలు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీపై ఆసక్తిని చూపుతున్నారు. భారీ మెజా రిటీతో విజయం సాధించాలనే లక్ష్యంగా శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తు న్నారు. ఆయనకు ధీటుగా వైసిపి కూడా అన్ని సామాజిక వర్గాలను ఆకర్షించేలా ప్రయత్నాలను ప్రారంభించింది. పవన్‌పై బ్రహ్మాస్త్రాలను ప్రయో గించాలని ఆ పార్టీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.
బాధ్యత తీసుకున్న మిథున్ రెడ్డి
అధిష్ఠానం సూచనలతో ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ మిధున్‌రెడ్డి రంగంలోకి దిగారు.గొల్లప్రోలు మండలానికి మాజీ మంత్రి కురసాల కన్నబాబును, యు.కొత్తపల్లి మండలానికి మంత్రి దాడిశెట్టి రాజాలను ఇన్‌ఛార్జులుగా నియమించారు. పిఠాపురం మండలానికి మిథున్ రెడ్డి బాధ్యతలు చూసేలా ప్రణాళికను రూపొందించారు. దానికి తోడు నియోజకవర్గ కాపు నాయకుల కోసం ముద్రగడను రంగంలోకి దింపారు. ఇప్పటికే ఆయన గొల్లప్రోలులో కొంతమంది ముఖ్య నాయకులతో రహస్యంగా సమావేశం అయ్యారు. ఎన్నికల వ్యూహాలను అమలు చేసేందుకు కాకినాడ సిటీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, ఆయన అనుచరులు కూడా సన్నద్ధం అవు తున్నారు. . గతంలో జనసేన పిఠాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన మాకినీడి శేషుకుమారి, ఆమె అను చరులు వైసిపిలో బుధవారం చేరారు. సిఎం జగన్ సమక్షంలోనే ఆమె వైసిపి కండువా కప్పుకున్నారు. చేరికలు అనంతరం సీఎం జగన్ వంగా గీత, ముద్రగడ పద్మనాభంలతో భేటీ అయ్యారు. స్థానిక రాజకీయ పరిస్థి తులు, గెలుపు ఓటముల అంచనాలపై చర్చించినట్లు సమాచారం.
లక్ష ఓట్ల మెజార్టీ అంటున్న పవన్
లక్ష ఓట్లు మెజారిటీ రావాలని కేడర్‌కు పిలుపునిచ్చారు. తాజాగా మంగళవారం మంగళగిరిలో జరిగిన నియోజకవర్గ నాయకుల భేటీలో ఈ అంశంపై చర్చించినట్లు సమాచారం. కొంతమంది టిడిపి, వైసిపి నాయకులు పవన్ సమక్షంలో ఆ పార్టీ కండువాలు కప్పుకున్నారు. వారిని ఉద్దేశించి పవన్ మాట్లాడారు. దేశంలోనే పిఠాపురం నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని చెప్పుకొచ్చారు. నియోజక వర్గంలో ప్రధాన సమస్యల పరిష్కారానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళతానని తెలిపారు. ఈనెల 28న నియోజకవర్గానికి రానున్న ఆయన మూడు రోజులపాటు పర్య టించి ఎన్నికల నేపథ్యంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం కాను న్నారు. మరోవైపు టిడిపి నేత వర్మ కూడా మద్దతు పలకడంతో మిగిలిన వర్గాల ఓటర్లను కూడా ఆకట్టుకునేందుకు పవన్ సిద్దపడుతున్నారు