మోదీ మానియాతో ఊగిన చిలుకలూరిపేట – ప్రజాతీర్పు ఖాయమయిందన్న ప్రధాని

వైసీపీని సాగనంపాలని ప్రజలు కోరుకుంటున్నారు. నష్టపోయిన రాష్ట్రాన్ని, ప్రజల్ని ఆదుకునేందుకు మేం సర్వశక్తులు ఒడ్డుతాం… ప్రజలు కూడా కూటమిపై అచంచలమైన నమ్మకంతో ఉన్నారని చెప్పేందుకు ఏర్పాటు చేసిన కూటమి తొలి బహిరంగసభ అంచనాలను మించి అద్భుత విజయాన్ని సాధించింది. ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా నిర్వహించిన మొదటి సభ అంచనాలను మించి విజయవంతమయింది.

కాంగ్రెస్, వైసీపీ వేర్వేరు కాదన్న మోదీ

జగన్ రెడ్డి గత ఐదేళ్లుగా బీజేపీకి మద్దతుగా ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో జగన్ కేసులు ఆలస్యమవుతున్నాయన్న వాదన ఉంది. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. జగన్ స్థానమేంటో స్పష్టంగా చెప్పారు. జగన్, కాంగ్రెస్ వేర్వేరు కాదని స్పష్టం చేశారు. అంటే జగన్ ను మోదీ కాంగ్రెస్ నేతగానే పరిగణిస్తున్నారు. అవసరార్థం.. జగన్ మద్దతు విషయంలో కామ్ గా ఉండవచ్చేమో కానీ.. ఇతర విషయాల్లో ఆయనను క్షమించే అవకాశం ఉండదనిస్పష్టం చేసినట్లుగా అవుతుంది. ప్రభుత్వంపైనా విరుచుకుపడ్డారు. గత ఐదేళ్లుగా మంత్రులు పోటీ పడి అవినీతి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీని ఇంటికి సాగనంపాలి అని బలంగా కోరుకుంటున్నారని తేల్చేశారు.

సోషల్ మీడియోలో మోదీ వరుస ట్వీట్లు

చిలుకలూరిపపేట సభ విషయంలో మోదీ సంతృప్తి చెందారు. సోషల్ మీడియాలో తన ఆనందాన్ని వ్యక్తంచేశారు. దాదాపుగా పన్నెండు ట్వీట్లు పెట్టారు. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ సీపీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, ఇది గమనించి ప్రజలు తమకు ఓటు వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే కూటమి ప్రాంతీయ పార్టీలను కలుపుకుని వెళ్తూ వారి అభివృద్ధిని కోరుకుంటుందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల కోసం రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారని ప్రధాని మోదీ కితాబిచ్చారు. రాష్ట్రంలో మనం గెలిస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడి, అప్పుడే వికసిత ఆంధ్రప్రదేశ్‌ సాధ్యం అన్నారు.

జన సునామీనే !

ఏ రాజకీయ పార్టీకి అయినా వచ్చే జన సందోహంలో ఉండే స్పందనను బట్టి .. పరిస్థితుల్ని అంచనా వేయవచ్చు. ఈ సభలో ప్రసంగాలు పూర్తయ్యే వరకూ ఒక్కరు కూడా బయటకు వెళ్లలేదు. సభ పూర్తయ్యే వరకూ వస్తున్నారు. మూడు వందల ఎకరాల ప్లేస్‌లో జనం పూర్తిగా నిండిపోయారు. ఇంకా రోడ్ల మీద పది కిలోమీటర్ల వరకూ ట్రాఫిక్ జాం అయింది. ప్రసంగించిన నేతలు కూడా.. స్పష్టమైన సందేశం ఇచ్చారు.
పదేళ్ల తర్వాత ఒకే వేదికపై మోదీ, చంద్రబాబు, పవన్ కనిపించిన సభ కావడంతో దేశం మొత్తం ఆసక్తి చూపించింది. జాతీయ మీడియా కూడా సభను కవర్ చేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మొదటి సభ కావడంతో దేశమంతా ఆసక్తి చూపించింది.