ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టిని చూసి రెప్పవేయడం మర్చిపోయారంతా. ఎంత అందంగా ఉందో అని అనుకోని వారులేరు. అందం, నటనలో నూటికి నూరు మార్కులు తెచ్చుకుంది. ఆ సినిమాలో బేబమ్మగా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకోవడంతో ప్రేక్షకుల మదిలో కూడా బేబమ్మగా ఫిక్సైపోయింది. అయితే ఇప్పుడీ బేబమ్మని అమ్మని చేసేసారు…
బేబమ్మ కాదు అమ్మ
ప్రస్తుతం శర్వానంద్ తో మనమే సినిమాలో నటిస్తోంది కృతి శెట్టి. ఈ సినిమాలో కృతి శెట్టి మదర్ రోల్ లో కనిపిస్తోంది. రీసెంట్ గా రిలీజైన ‘మనమే’ టీజర్ లో కృతి శెట్టి చిన్న బాబుకి ఫీడింగ్ ఇస్తూ కనిపించింది. దీంతో ఏంటి… బేబమ్మను అమ్మను చేసేశారంటూ ప్రేక్షకులు అవాక్కయ్యారు. అయితే కృతి మాత్రం సినిమా కథలను బట్టి మదర్ రోల్స్ చేయడం తప్పేమి కాదు అంటోంది. అది నిజమే అయినా…అప్పుడు నీకు మదర్ రోల్ ఏంటి బేబమ్మా అని ఫ్యాన్స్ తెగ ఫీలైపోతున్నారు. ఇది నిజంగా షాకిచ్చే సర్ ప్రైజ్ అంటున్నారంతా.
ఆఫర్లు తగ్గడం వల్లేనా!
వాస్తవానికి ఉప్పెన సినిమా హిట్ తర్వాత కృతి శెట్టి ఎక్కడికో వెళ్లిపోతుంది అనుకున్నారు కానీ…అమ్మడి కెరీర్ ఆశించిన స్థాయిలో సాగలేదు.
శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు సినిమాలతో పర్వాలేదు అనిపించుకుంది. అయితే ఆ తర్వాత మొదలయ్యాయి కృతి శెట్టి కష్టాలు. అమ్మడు చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. వరుస ఫ్లాపుల వల్ల ఆఫర్లు కూడా తగ్గాయి. మొదటి సినిమాతో ఎంత త్వరగా సూపర్ క్రేజ్ తెచ్చుకుందో వరుస ఫ్లాపుల వల్ల అలానే కెరీర్ గ్రాఫ్ పడిపోయేలా చేసుకుంది. కథల విషయంలో సరైన ఎంపిక లేకపోవడం వల్లే బేబమ్మ పరిస్థితి ఇలా అయ్యిందేమో.
ఇతర భాషల్లో బిజీ
తమిళ, మలయాళంలో క్రేజీ ఆఫర్లు అందుకుంటోంది కృతి. కోలీవుడ్ లో జయం రవి హీరోగా చేస్తున్న జినీ సినిమాలో కృతి నటిస్తుంది. మలయాళంలో కూడా టాలెంటెడ్ హీరో టోవినో థామస్ చేస్తున్న సినిమాలో కృతి శెట్టి హీరోయిన్. ఈ రెండు సినిమాలతో కృతి శెట్టి అక్కడ కూడా పాగా వేయాలని చూస్తోంది. అయితే తనకు బేబమ్మగా సూపర్ పాపులారిటీ తెచ్చిన టాలీవుడ్ లో నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తోంది. మరి శర్వానంద్ ‘మనమే’ హిట్ అయితే ఇక్కడ కూడా కృతికి వరుస అవకాశాలు వస్తాయేమో చూడాలి.