పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలి అనుకునేవారికోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది IRCTC. 9 రోజుల ప్యాకేజీలో భాగంగా పూరి, కోణార్క్, గయ, వారణాసి , అయోధ్య, ప్రయాగ్‌రాజ్ కవర్ చేస్తారు. ఇలా 9 రోజుల పర్యటనలో ఆరు ముఖ్యమైన ప్రదేశాలను చూడొచ్చు. పూర్తి వివరాలివే…
పుణ్యక్షేత్ర యాత్ర పూరి-కాశీ-అయోధ్య ప్యాకేజీ వివరాలు (టూర్ కోడ్ : SCZBG20)
8 రాత్రులు 9 రోజుల ఉండే ఈ టూర్ మార్చి 23 న ప్రారంభమవుతుంది. ప్రయాణం సికింద్రాబాద్ నుంచి మొదలై పూరి , కోణార్క్, గయ , వారణాసి , అయోధ్య, ప్రయాగ్ రాజ్ వరకూ ఉంటుంది. మొత్తం సీట్ల సంఖ్య 716 (SL: 460, 3AC: 206, 2AC: 50). సికింద్రాబాద్ లో మొదలయ్యే ట్రైన్…కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, పెందుర్తి, విజయనగరం మీదుగా వెళుతుంది..
టికెట్ ధరలివే
ఎకానమీ క్లాస్ టికెట్ బుక్ చేసుకుంటే డబుల్/ట్రిపుల్ షేరింగ్‌కు రూ. 15,200 నుంచి ఉంది. అదే స్టాండర్డ్ క్లాస్ అయితే రూ. 24,200 చెల్లించుకోవాలి. ఇక కంఫర్ట్ కేటగిరి అయితే రూ. 31,500 పడుతుంది. పిల్లలకు ఈ టూర్ ధర వేరుగా ఉంటుంది. 5 నుంచి 11 ఏళ్ల వయసులో ఉన్న పిల్లలు ఉంటే.. వారికి ఎకానమీ క్లాస్ టికెట్ అయితే రూ. 14,200 పడుతుంది. ఇక స్టాండర్డ్ క్లాస్ టికెట్ అయితే రూ. 22,900 చెల్లించుకోవాలి. అలాగే కంఫర్ట్ కేటగిరి అయితే రూ. 30,100 పడుతుంది.
ఇవన్నీ కవర్ అవుతాయి
ఈ టూర్లో భాగంగా పూరీ జగన్నాథ దేవాలయం, కోణార్క్ సూర్య దేవాలయం, గయ విష్ణుపాద ఆలయం, వారణాసి కాశీ విశ్వనాథ దేవాలయం, కారిడార్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణా దేవి ఆలయం. సాయంత్రం గంగా హారతి… అయోధ్యలో సరయు నది వద్ద రామజన్మ భూమి, హనుమాన్‌గర్హి, హారతి. ప్రయాగరాజ్: త్రివేణి సంగమం…
టూర్ ప్యాకేజీకి ఇవి మినహాయింపు
మాన్యుమెంట్ ప్రవేశ ఛార్జీలు, బోటింగ్, సాహస క్రీడలు . భోజనం ముందే సెట్ చేస్తారు. ఏదైనా రూమ్ సర్వీస్ కు ఛార్జీ చేస్తారు. స్థానిక గైడ్ల ఖర్చు ప్రయాణంలో చేర్చరు. లాండ్రీ ఖర్చులు, వైన్లు, మినరల్ వాటర్, ఆహారం, డ్రింక్స్ ఇవన్నీ మీ వ్యక్తిగత ఖర్చులే.
ప్రయాణికులు ఇవి తెచ్చుకోవాలి
ప్రయాణికులు ఓటరు ID/ఆధార్ కార్డ్, కోవిడ్-19 ఫైనల్ డోస్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఈ టూర్ ప్యాకేజీకి ఎల్టీసీ అప్రూవ్ (LTC Approved)చేస్తారు. సింగిల్‌గా బుక్ చేసుకున్న ప్రయాణికుడు ఇతర ప్రయాణికులతో డబుల్ ఆక్యుపెన్సీ లేదా ట్రిపుల్ ఆక్యుపెన్సీలో పంచుకోవాలి. ఆలయ దర్శనం, స్మారక చిహ్నాల సందర్శన కోసం COVID-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్(Covid Certificate) తప్పనిసరి. టూర్ బయలుదేరడానికి 03-04 రోజుల ముందు సీటింగ్ ఫిక్స్ చేస్తారు. ఈ టూర్ మార్చి 23 న మొదలై…మార్చి 31 వరకూ ఉంటుంది.