ఈ ఏడాది టాలీవుడ్ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమాలు అంటే కల్కి 2898 ఏడీ, పుష్ప 2 . ఈ మూవీస్ కొనడానికి మాత్రం బయ్యర్లు ముందుకు రావడం లేదంట…ఎందుకో తెలుసా…
మే లో ‘కల్కి’ రిలీజ్
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 500 కోట్లకి పైగా బడ్జెట్ తో కల్కి సినిమాని తెరకెక్కిస్తున్నారు. మే నెలలో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది. సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కంప్లీట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో ఆడియన్స్ చాలా ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ సినిమా కొనడానికి బయ్యర్లు మాత్రం ముందుకి రావడం లేదంట. దీనికి కారణం నిర్మాత అశ్వినీదత్ చెబుతున్న ధరలే. ఏరియా వారీగా ఈ మూవీ హక్కుల కోసం నిర్మాత భారీగా డిమాండ్ చేస్తున్నారంట. ఓవర్సీస్ హక్కుల కోసం 100 కోట్లు కోట్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే నైజాం రైట్స్ కోసం 80 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారంట. నాగ్ అశ్విన్ చివరిగా మహానటి మూవీ చేశాడు. చాలా గ్యాప్ తర్వాత కల్కి 2898ఏడీ మూవీ చేస్తున్నాడు. అయితే సలార్ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న బయ్యర్లకి పెద్దగా లాభాలు రాలేదు. అందుకే కల్కి మూవీ విషయంలో ఆలోచనలో పడ్డారు బయ్యర్లు
ఆగష్టు 15 పుష్ప రిలీజ్
పుష్ప 2 సినిమా ఓవర్సీస్ హక్కుల కోసం కూడా మైత్రీ నిర్మాతలు వంద కోట్లు డిమాండ్ చేస్తున్నారట. తెలుగు రాష్ట్రాలలో కూడా రైట్స్ కోసం భారీగానే కోట్ చేస్తున్నారని టాక్. నిజానికి పుష్ప మూవీ తెలుగు రాష్ట్రాలలో ఆడియన్స్ ని పెద్దగా మెప్పించలేదు. అతి కష్టం మీద బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ని అందుకుంది. నార్త్, కోలీవుడ్, మలయాళీ ఇండస్ట్రీలలో హిట్ టాక్ తెచ్చుకుంది. పుష్ప 2 మీద విపరీతమైన క్రేజ్ ఉండటంతో నిర్మాతలు భారీగా డిమాండ్ చేస్తున్నారట. అందుకే రైట్స్ కొనడానికి బయ్యర్లు ముందుకి రావడం లేదంటున్నారు. ఆగస్ట్ 15 కి రిలీజవడం కష్టమేనని..డేట్ మారొచ్చని వచ్చిన రూమర్స్ కి చెక్ పెట్టారు మేకర్స్. ఏదిఏమైనా ఆగష్టు 15 కి థియేటర్లలో తీసుకొచ్చేందుకు ఫిక్సయ్యారు.
ఈ సినిమాలకి సంబంధించి టీజర్, ట్రైలర్స్ విడుదల చేసి హైప్ క్రియేట్ చేయగలిగితే పబ్లిక్ ఇంటరెస్ట్ బట్టి డిస్టిబ్యూటర్స్ డేర్ చేసే ఛాన్స్ ఉండొచ్చు. ఏం జరుగుతుందో చూద్దాం..