ఏపీ పొత్తుల్లో ఆసక్తి కర నిర్ణయాలు జరుగుతున్నాయి టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కూటమిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. మూడు పార్టీల సీట్ల పైన ఢిల్లీ వేదికగా ప్రాధమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు. . ఇప్పుడు ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలనే చర్చల్లో కొన్ని మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. పురంధేశ్వరి, పవన్‌తో బీజేపీ కేంద్ర బృందం భేటీ అయ్యింది. గజేంద్రసింగ్ షెఖావత్, జయంత్ పాండా, శివప్రకాష్ చర్చలు జరిపారు. అయితే నేడు మూడుపార్టీల మీటింగ్‌లో చంద్రబాబు పాల్గొననుండటంతో సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
బీజేపీకి పెరగనున్న అసెంబ్లీ స్థానాలు
.జనసేన కాకినాడ, మచిలీ పట్నం స్థానాల నుంచి పోటీ చేయనుంది. ఇక, ఎమ్మెల్యే స్థానాల్లో జనసేన తమకు కేటాయించిన 24 లో ఇప్పటి వరకు 5 స్థానాలకు అభ్యర్దులను ప్రకటించింది. మిగిలిన 19 స్థానాల పైన ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. బీజేపీకి ఇచ్చే ఆరు స్థానాల పైన ప్రాధమికంగా నిర్ణయం జరిగింది. కానీ, బీజేపీ నుంచి మరో నాలుగు అసెంబ్లీ స్థానాల పైన ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం. అయితే, బీజేపీకి అసెంబ్లీ స్థానాలు పెంచే అంశం పైన అధికారికంగా నిర్ణయం జరగాల్సి ఉంది.
పలు రకాల సీట్ల కాంబినేషన్ పై చర్చ
ఏలూరు, హిందూపురం, రాజంపేట, తిరుపతి, అరకు, అనకాపల్లి, రాజమండ్రి, నర్సాపురం లో ఆరు స్థానాలను బీజేపీకి కేటాయించాల్సి ఉంది. బీజేపీ విశాఖ కోసం పట్టు బడుతోంది. అనకాపల్లి బీజేపీకి ఇవ్వటానికి నిర్ణయించటంతో విశాఖ సీటు నుంచి టీడీపీ పోటీ చేయటం ఖాయమని చెబుతున్నారు. అదే విధంగా రాజమండ్రి, ఏలూరు రెండు స్థానాల్లో ఒకటే బీజేపీకి దక్కనుంది. నిడుదవోలు నుంచి జనసేన నేత కందుల దుర్గేష్ పోటీకి సిద్దం అవుతున్నారు. బీజేపీకి టీడీపీ ఆరు అసెంబ్లీ స్థానాలు కేటాయించినట్లు ప్రచారం నడుస్తోంది. వాటిలో.. విశాఖ నార్త్, పి.గన్నవరం, కైకలూరు, ధర్మవరం, జమ్మలమడుగు, మదనపల్లె, గుంటూరు ఉన్నాయి. అయితే.. మదనపల్లె, గుంటూరు సీట్లుకు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ రాకపోవడంతో చర్చలు సాగుతున్నాయి. ఈ రెండింట్లో ఏదో ఒక స్థానం బీజేపీ దక్కే అవకాశం ఉంది. దాంతోపాటు.. నంద్యాల అసెంబ్లీ టిక్కెట్ బీజేపీ నేత అభిరుచి మధు అడుగుతుండగా.. ఇప్పటికే అక్కడ టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంతో సందిగ్ధం నెలకొంది. ఈ క్రమంలోనే.. ఆ స్థానాలు, అభ్యర్థుల ఎంపికపై ఫైనల్ స్క్రీనింగ్ చేస్తున్నారు బీజేపీ నేతలు.
సీట్ల కేటాయింపుపై ఇప్పటి వరకూ పుకార్లే
సీట్లు అభ్యర్థులపై ఇప్పటి వరకూ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా పుకార్లే. షెకావత్ పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన తర్వాత ఢిల్లీకి వెళ్లి నివేదిక ఇస్తారు. ఆ నివేదిక ను పార్లమెంటరీ కమిటీ పరిశీలించి ఆమోద ముద్ర వస్తే.. అప్పుడు జాబితా రిలీజవుతుంది. అప్పటి వరకూ ఏ సీటుల.. ఏ అభ్యర్థి ఖరారు కాదనేది.. కూటమి నేతల ప్రకటన.