తెలుగు సినిమాను ప్రపంచ స్థాయి సినిమాల పక్కన నిలబెట్టేందుకు రాజమౌళి చేసిన కృషి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బాహుబలి కి ముందు ఆ తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయ్. టాలీవుడ్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. RRR తో అంతకుమించి అనిపించేలా రీసౌంజ్ చేశాడు జక్కన్న. ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న మూవీతో హాలీవుడ్ ని షేక్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇప్పుడు జక్కన్న బాటలోనే వెళుతున్నాడు మరో డైరెక్టర్ నాగ్ అశ్విన్…
హాలీవుడ్ లో ప్రమోషన్
రాజమౌళి చూపించిన బాటలోనే నాగ్ అశ్విన్ కూడా వెళ్తున్నాడు. ప్రభాస్ లీడ్ రోల్ లో టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా కల్కి 2898 AD. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చూపించారు. హాలీవుడ్ అప్పీల్ తో వస్తున్న కల్కి ఈ సినిమా తో రాజమౌళిని మించి పోయేలా ఉన్నాడు నాగ్ అశ్విన్. ఈ మేరకు కల్కి సినిమా ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో చేస్తున్నాడు. హాలీవుడ్ లో కూడా క్రేజ్ ఏర్పడేలా చేయడంలో నాగ్ అశ్విన్ సూపర్ స్కెచ్ వేశాడని సమాచారం.
రాజమౌళి తర్వాత నాగ్ అశ్విన్
మే 9న రిలీజ్ అవుతున్న కల్కి సినిమా ప్రమోషన్స్ ఏప్రిల్ మొత్తం భారీగా ప్లాన్ చేశారని హాలీవుడ్ లో కూడా ప్రమోషన్స్ మొదలు పెడతారని టాక్.RRR రిలీజ్ తర్వాత హాలీవుడ్ మీడియాకు రాజమౌళి అండ్ టీమ్ ఇంటర్యూలు ఇచ్చారు. కానీ నాగ్ అశ్విన్ ముందుగానే అక్కడ మీడియా కవరేజ్ ప్లాన్ చేస్తున్నారట. ఇదంతా చూస్తుంటే రాజమౌళి తర్వాత ఆ రేంజ్ ముద్ర వేసుకునే ప్లాన్ లో నాగ్ అశ్విన్ ఉన్నట్టున్నాడు.
9 భాగాలుగా కల్కి?
నాగ్ అశ్విన్ కల్కిని వైజయంతి మూవీస్ 500 కోట్ల పైన బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాను 9 భాగాలుగా తీసే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. అదే నిజమైతే కల్కి మరో ఇండియన్ మార్వెల్ సీరీస్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకుంటుందని చెప్పొచ్చు. మరి విజువల్ వండర్ గా ఆడియన్స్ కు ఐ ఫీస్ట్ అందిస్తుందని అంటున్నారు. సమ్మర్ కానుకగా వస్తన్న ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం…