జాతకంలో గురుబలం లేదా – అయితే ఈ ఆలయానికి వెళ్లిరండి!

జాతకాలను విశ్వశించేవారికి..గురుబలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గురుబలం ఉంటే ఇంకెలాంటి దోషాలు ఉన్నా సక్సెస్ ఆగదు. తమిళనాడులో ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకుంటే ఆ దోషాలు తొలగిపోతాయంటారు.

తమిళనాడులోని తంజావూరు నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది వశిష్టేశ్వర దేవాలయం. తిరుక్కూరుగవూర్ మార్గంలో తిట్టై గ్రామంలో ఈ వశిష్టేశ్వర దేవాలయం ఉంది. ఈ దేవాలయాన్ని క్రీస్తుశకం 12వ శతాబ్దంలో చోళుల నుంచి నిర్మించినట్లు చెబుతారు. ఇక్కడ ఉన్న మూలవిరాట్టు స్వయంభువుగా చెబుతారు. అమ్మవారిని ఉళగనాయకి అని అంటారు. ఇక్కడ మూలవిరాట్టు స్వయంభువు కాబట్టే స్వామివారిని స్వయంభూథేశ్వర అని పిలుస్తుంటారు. ఈ దేవాలయాన్ని విష్ణువు స్వయంగా నిర్మించాడని.. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే అవివాహితులకు వివాహం జరుగుతుందంటారు.

గురు భగవాన్ ప్రత్యేక దేవాలయం
ఇక్కడ గురు భగవాన్ కు ప్రత్యేక దేవాలయం ఉండటం. వశిష్టేశ్వర, లోకనాయకి దేవాలయాల మధ్య ఈ దేవాలయం ఉంటుంది. ఇక్కడ మూలవిరాట్టు దక్షిణ దిశగా ఉంటాడు కాబట్టి ఆయన్ను దక్షిణ మూర్తి అనే పేరుతో కూడా పిలుస్తారు.ఇక్కడ ఉన్న గురువుకు నాలుగు భుజాలు ఉంటాయి. నిలబడిన స్థితిలో స్వామివారు దర్శనమిస్తారు. నాలుగు చేతుల్లో నాలుగు గ్రంథాలు ఉంటాయి. ఈ ఆలయంలో ఏడాది మొత్తం ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. అయితే మహా శివరాత్రి, చైత్ర పౌర్ణమి రోజు జరిగే ఉత్సవాలు చాలా ప్రత్యేకం. ఈ రోజు భారీగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. గురు భగవాన్ ని దర్శించుకుంటే జాతకంలో ఉన్న గురుదోషం తొలగిపోతుందని భక్తుల విశ్వాసం…

శివలింగంపై సూర్య కిరణాలు
ఈ దేవాలయంలో మరో విశిష్టత ఏంటంటే ఏడాదిలో ఆరు రోజులు సూర్య కిరణాలు శివలింగం పై పడుతాయి. ఏటా మార్చి 25,26,27 , ఆగస్టు 15,16,17 ఈ ఈ దేవాలయం పై కప్పు నుంచి ప్రతి 24 గంటలకు ఒకసారి ఒక నీటి బిందువు శివలింగం పై పడుతుంది. ఇందుకు కారణం ఈ దేవాలయం నిర్మాణంలో వాడిన వాస్తు శైలి అని చెబుతారు. అంతేకాకుండా వాతావరణ మార్పుల వల్ల కూడా ఈ విధమైన అద్బుతం జరుగుతుందంటారు. ఆలయ గోపురం పై రెండు ప్రత్యేకమైన రాళ్లను సూర్యగాంధక్కల్, చంద్ర గాంధక్కల్ అని అంటారు. ఈ రాళ్లవల్లే వాతావరణంలోని తేమ నీటి బింధువులుగా మారి శివలింగం పై పడుతోందని చెబుతారు.

గమనిక: పుస్తకాల నుంచి సేకరించినవి, పండితులు చెప్పిన సూచనల ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం..