వైసీపీలోకి గొల్లపల్లి, మండలి బుద్దప్రసాద్ – వలసలు పెరుగుతున్నాయా ?

అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీని వీడి వైసీపీ కండువా కప్పుకోనున్నారు. రాజోలు టికెట్ ను జనసేనకు కేటాయించడంతో ఆయన కినుకు వహించారు. టీడీపీ అధిష్టానం నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు.

జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్ నగొల్లపల్లి

వైసీపీలో చేరేందుకు అనుచరులతో కలిసి తాడేపల్లికి వెళ్లారు సూర్యారావు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరనున్నారు. రాజోలు వైసీపీ టికెట్ తనకు ఇవ్వాలని సూర్యారావు అడిగే అవకాశం ఉంది. గొల్లపల్లి సూర్యారావు రాజోలు టీడీపీ ఇంఛార్జ్ గా ఉన్నారు. టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు. తన అనుచరులతో కలిసి ఆయన తాడేపల్లి చేరుకున్నారు. రాజోలు నుంచి జనసేన పార్టీ పోటీ చేయబోతోందని పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి గొల్లపల్లి సూర్యారావు, ఆయన అనుచరులు అసంతృప్తిగా ఉన్నారు. రాజోలు నియోజకవర్గానికి సంబంధించి జనసేన ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక వరప్రసాద్.. వైసీపీలో చేరారు. ఈ క్రమంలో రాజోలు వైసీపీ అభ్యర్థిగా జగన్ ఎవరి పేరుని ఖరారు చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

వైసీపీలోకి అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే బుద్ద ప్రసాద్

అవనిగడ్డ నుంచి మండలి బుద్దప్రసాద్ ను వైసీపీలో చేరనున్నారు. పొత్తుల్లో టీడీపీ అవనిగడ్డను జనసేనకు కేటాయించింది. దీంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. పార్టీ నేతల సమావేశం పెట్టి… వైసీపీ లోకి వెళ్తున్నానని చెప్పారు. వైసీపీకి సింహాద్రి చంద్రశేఖర్ అనే డాక్టర్ కు టిక్కెట్ ప్రకటించినా ఆయన నియోజకవర్గం వైపు చూడలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ను. మచిలీపట్నం ఇంచార్జ్ గా నియమించారు జాబితా ప్రకటించినప్పుడు పంజరంలోంచి బయటకు వచ్చిన పక్షి లాగా… స్వేచ్చా స్వాతంత్ర్యాలు పొందినట్లు ఉందని చెబుతున్నారు..

త్వరలో మరిన్ని చేరికలు !

వైసీపీలో చేరికలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ, జనసేనలో అన్యాయం జరిగిందని భావించే వారంతా.. వైసీపీలో చేరే అవకాశం ఉంది. కొంత మందికి టిక్కెట్ అవకాశాలు కల్పించినా ఎక్కువ మంది పార్టీ కోసం పని చేయాలని వైసీపీ సూచించే అవకాశం ఉంది.