టిడిపి – జనసేన ఇటీవల ఉమ్మడిగా ప్రకటించిన అసెంబ్లీ స్థానాల సీట్ల వ్యవహారం ప్రస్తుతం ఆ పార్టీలకు తలనొప్పిగా మారింది. బలంగా ఉన్న నియోజకవర్గాల్లో జనసేనకు టికెట్లు దక్కకపోవడంతో తీవ్రస్థాయిలో అసంతృప్తిని సామాజిక మాధ్యమాల వేదికగా వెళ్లగక్కుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పొత్తు పార్టీల్లో చోటుచేసుకున్న పరిణామాలు జిల్లా రాజకీయాలను మరింత వేడెక్కించాయి.
ఆందోళన చేస్తున్న జగ్గంపేట జనసేన నేత సూర్య చంద్ర
జగ్గంపేటలో టిడిపి నేత జ్యోతుల నెహ్రూకి టికెట్ కేటాయించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాఠంశెట్టి సూర్యచంద్ర గత రెండు రోజులుగా గోకవరం మండలం అచ్యుతాపురంలో అంతిమ నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. నిన్న, మొన్నటి వరకు టిక్కెట్ తనకే దక్కుతుందని ఆశతో ఎదురుచూస్తుండగా పొత్తులో భాగంగా టిడిపికి కేటాయించడంతో భంగపడ్డారు. ఇటీవల మంగళగిరిలో జరిగిన సమావేశానికి వెళ్ళినప్పుడు కూడా టిక్కెట్ తనకే వస్తుందని అధి ష్టానం నుంచి సంకేతాలు అందాయని, అయితే తొలి జాబితాలోనే దక్కకపో వడంతో పవన్ కళ్యాణ్ తనను మోసం చేశారని ఆరోపిస్తున్నారు. పొత్తులో భాగంగా టిక్కెట్ దక్కించుకున్న జ్యోతుల నెహ్రూ ఇప్పటివరకు ఆయన్ను కలవకపోవడం చర్చినీయంశంగా మారింది.
జనసేనకు కేటాయించిన చోట్ల టీడీపీ నిరసనలు
కాకినాడ రూరల్లో జనసేన ఇన్ఛార్జ్ పంతం నానాజీకి టిక్కెట్ దక్కడంతో టిడిపి సీనియర్ నేత మాజీ ఎంఎల్ఎ పిల్లి అనంత లక్ష్మి ఇంటి వద్ద సోమవారం హైడ్రామా నడిచింది. మాజీ ఎంఎల్ఎ భర్త పిల్లి సత్తిబాబుకు టికెట్ ఇవ్వాలంటూ టిడిపి కార్యకర్త ఒకరు ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సందర్భంగా రమణయ్యపేటలోని పిల్లి సత్తిబాబు నివాసానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకుని టిక్కెట్ దక్కకపోవడంతో టిడిపికి రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అన్యాయం చేసిన పార్టీలో కొనసాగ డానికి వీలు లేదంటూ మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామంటూ ఈ సందర్భంగా హెచ్చరించారు.అటు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనూ టిక్కెట్ల రగడ కొనసాగుతోంది. కొత్తపేటలో పార్టీ బలంగా ఉన్నా టికెట్ కేటాయించకపోవడం సరికాదంటూ జనసేన కేడర్ ప్రకటిస్తున్న అసంతృప్తి తారాస్థాయికి చేరింది. జనసేన నుంచి బండారు శ్రీనివాస్ కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న టిక్కెట్ కేటాయించకపోవడంతో కార్య కర్తలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ఇలా అయితే ఓట్ల బదిలీ సాధ్యమా ?
అధిష్టానంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నారు. ముమ్మిడివరంలో పితాని బాలకృష్ణకు టికెట్ దక్కకపోవడంతో ఆదివారం మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్లి పార్టీ పెద్దలతో చర్చించారు. సానుకూ లమైన నిర్ణయం ప్రకటిం చకపోతే భవిష్యత్తు కార్యా చరణ తామే ప్రకటి స్తామంటూ ఈ సందర్భంగా హెచ్చ రించినట్లు సమాచారం. అయితే వేరేచోట టికెట్ కేటాయించేలా ఆలోచనలు చేస్తున్నట్లు పార్టీ పెద్దలు బాలకృష్ణకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు సమాచారం. పరిస్థితి ఇలాగే ఉంటే.. ఓట్ల బదిలీ సాధ్యం కాదన్న వాదన వినిపిస్తోంది.