ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ నియోజకవర్గాల్లో హిందూపురానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ సారి ఆ ఎంపీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ పార్లమెంట్ లో అడుగు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. హిందూపురం నుంచి పోటీకి పలువురు బీజేపీ నేతలు పోటీ పడుతున్నారు. పరిపూర్ణానంద కూడా హిందూపురంలోనే పోటీ చేస్తా అంటున్నారు. కానీ స్థానికులు… గత ఏడాది గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న విష్ణువర్ధన్ రెడ్డికి బీజేపీ హైకమాండ్ టిక్కెట్ ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హిందూపురంలో పార్టీని బలోపేతం చేసిన విష్ణువర్ధ ్రెడ్డి
హిందూపురం నుంచి పోటీ చేయాలన్న ఉద్దేశంతో విష్ణువర్ధన్ రెడ్డి గత కొంత కాలంగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. సొంత నియోజకవర్గం కదిరితో పాటు హిందూపురం పార్లమెంట్ పరిధిలో కరెంట్ చార్జీల పెంపు, అభివృద్ధి లేకపోవడం, నిరుద్యోగ సమస్యలపై విస్తృతంగా ధర్నాలు నిర్వహించారు. ఇటీవల అయోధ్య రాముని కళ్యాణాన్ని అత్యంత భారీగా ఏర్పాటు చేశారు. పొత్తు ఉన్నా లేకపోయినా ఆయన పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పొత్తు ఉంటే.. ఇంకా విజయం సునాయాసం అవుతుందని అంచనా వేస్తున్నారు.
కలసి రానున్న సామాజిక సమీకరణాలు
హిందూపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా బళ్లారి మాజీ ఎంపీ శాంతకు టిక్కెట్ కేటాయించారు. ఆమె విషయంలో నియోజకవర్గంలో అసంతృప్తి ఉంది. పైగా ప్రధాన సామాజిక వర్గాన్ని పక్కన పెట్టేలా అన్ని రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ఎంపీ సీట్లలో ప్రధాన సామాజికవర్గం ఉండకూడదన్నట్లుగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండటంతో ఆ వర్గం ఓటర్లలో అసంతృప్తి ఉంది. విష్ణువర్ధన్ రెడ్డి నిలబడితే ఓట్లు పోలరైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని భఆవిస్తున్నారు.
ఏపీలో ప్రధాని మోదీకి భారీ ఆదరణ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కి భారీ ఆదరణ ఉంది. సీఓటర్ సర్వేలో 56 శాతం మంది ప్రజలు ఆదరించారు. హిందూపురం ఎంపీ సీటులో బీజేపీ జెండా ఎగురవేయవచ్చని భావిస్తున్నారు. మోదీ పదేళ్ల పాలన.. విశ్వగురుగా భారత్ ను తీర్చిదిద్దుతున్న వైనం.. ప్రజల్ని ఆకట్టుకుంటోంది.దీన్ని ఓట్లుగా మార్చుకుంటే చాలు విజయం లభిస్తుదంని రాజకీయ వర్గాల అంచనా. ఆ దిశగా విష్ణువర్ధన్ రెడ్డి జోరుగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు