లెమన్ వాటర్ ను చాలామంది ఇష్టంగా తీసుకుంటారు. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బరువు తగ్గాలనే ఆలోచనలో ఉన్నవారు పరగడుపునే నిమ్మకాయ తేనె కలిపి తీసుకుంటారు. సమ్మర్లో అయితే నిత్యం నిమ్మకాయ నీళ్లు తాగేవారున్నారు. ఇంతకీ నిమ్మకాయ నీళ్లు ఆరోగ్యానికి మంచిదా-కాదా? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు…
గుండెల్లో మంట
నిమ్మకాయ నీటిని అధికంగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంట వస్తుంది. ఎందుకంటే ఇది ప్రోటీన్ విడగొట్టే ఎంజైమ్ అయిన పెప్సిన్ని సక్రియం చేస్తుంది. అదే సమయంలో, దాని అధికంగా తీసుకోవటం వల్ల పెప్టిక్ అల్సర్ వస్తుంది. ఇది మరింత ప్రమాదకరంగా మారుతుంది.
డీ హైడ్రేషన్
లెమన్ వాటర్ లిమిటెడ్ గా తీసుకుంటే పర్వాలేదు కానీ పదే పదే తాగడం వల్ల డీహైడ్రేషన్ తలెత్తే ప్రమాదం ఉంది. ఎందుకంటే నిమ్మకాయ నీటిని తాగినప్పుడు ఎక్కువసార్లు శరీరంలోని నీరు బయటకు వెళుతుంది. శరీరంలోని అనేక ఎలక్ట్రోలైట్లు , సోడియం వంటి మూలకాలు మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. దీంతో డీహైడ్రేషన్ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఐరన్ స్థాయి పెరిగినా ప్రమాదమే
నిమ్మ రసం తరుచూ తాగుతుంటే అధిక మొత్తంలో విటమిన్ సీ రక్తంలో ఐరన్ స్థాయిని పెంచుతుంది. ఇది ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో అంతర్గత అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
కిడ్నీలో రాళ్లు
నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. దీంతోపాటుగా తగినంత మొత్తంలో ఆక్సలేట్ ఉంటుంది. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో స్ఫటికాల రూపంలో పేరుకుపోయి కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.
ఎముకలపై ప్రతికూల ప్రభావం
నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. నిమ్మకాయలో ఎసిడిటీ ఉంటుంది. దీని వల్ల ఎముకలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. లెమన్ వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎసిడిటీ వస్తుంది. నిమ్మకాయలో అధిక మొత్తంలో యాసిడ్ ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో యాసిడ్ పరిమాణం పెరుగుతుంది.
వీళ్లు అస్సలు తాగొద్దు
టాన్సిల్ సమస్య ఉన్నవారు నిమ్మరసం తాగరాదు.ఓ పరిశోధన ప్రకారం నిమ్మకాయ నీటిని ఎక్కువగా తీసుకుంటే, అది గొంతు నొప్పికి కారణమవుతుంది.
నిమ్మకాయ నీళ్లు ఆరోగ్యానికి మంచిదే కానీ లిమిటెడ్ గా తీసుకుంటే మాత్రమే అని గుర్తుంచుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు…
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.