ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరిలో అయోధ్య సీతారామాల కళ్యామోత్సవం కన్నుల పండువగా సాగింది. ఒక్క కదిరి నుంచే కాకుండా ఉమ్మడి అనంతపురంల వ్యాప్తంగా జిల్లా ప్రజలు తరలి వచ్చి రాముల వారి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. అయోధ్య రామయ్య ఆలయ నిర్మాణం కల సాకారమైన సమయంలో అక్కడికి వెళ్లలేనివారంతా.. ఇక్కడ రాముడి సేవలో పాల్గొని తరలించారు.
50వేలకు మంచి భక్తులు హాజరు
సేవా భారతి ఆధ్వర్యంలో విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలో ఈ అయోధ్య రాముని కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పూర్తిగా భక్తి పారవశ్యం మినహా ఎక్కడా రాజకీయ ప్రస్తావన లేదు. రాముడు అంది వాడని.. ప్రజలు నిరూపించారు. పార్టీలకు అతీతంగా ప్రజలు నేతలు వచ్చి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఎ మాత్రం లోటు పాట్లు లేకుండా అత్యంత భారీగా కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. యాభై వేల మంది వస్తారని అనుకున్నారు కానీ అంత కంటే ఎక్కువ మందే వచ్చి ఉంటారని అంచనా వేస్తున్నారు.
కదిరి ప్రజల అభిమానం పొందిన విష్ణు
అయోధ్య రామాలయ కల్యాణంతో విష్ణువర్ధన్ రెడ్డి ప్రజల అభిమానాన్ని పొందారు. కదిరి నుంచి ఎదిగిన ఆయన .. రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీకి విస్తృతంగా సేవలు చేస్తూ … క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ సొంత గడ్డకు సేవ చేయడానికి సమయం చూసుకుంటూనే ఉన్నారు. తాజాగా అయోధ్య రామాలయ కళ్యాణోత్సవం నిర్వహణతో ప్రజల అభిమానాన్ని మరింత పొందారు.
అయోధ్య రాముల వారి దర్శనానికి వెళ్లే వారికి సాయం !
అయోధ్య రామాలయ దర్శనానికి వెళ్లాలనుకునేవారికి ఆర్థిక పరమైన సమస్యలు లేకున్నా .. అక్కడకు వెళ్లి దర్శనం చేసుకుని మళ్లీ రావడం అనేది పెద్ద ప్రయాస అవుతుంది. అందుకే సేవాభారతి ఆధ్వర్యంలో విష్ణువర్ధన్ రెడ్డి అయోధ్యకు వెళ్లాలనుకునే రాముని భక్తులకు ప్రత్యేక సాయం చేయాలని అనుకుంటున్నారు. ప్రతీ రాష్ట్రం నుంచి ఇప్పటికే ప్రత్యేక రైళ్లు ప్రారంభమయ్యాయి. రోడ్డు మార్గం ద్వారా వెళ్లడం చాలా కష్టం కనుక.. రైలు మార్గం ద్వారానే వెళ్లాలి. ప్రత్యేక రైళ్లను ప్రారంభిస్తారు. ఈ క్రమంలో సేవా భారతిని సంప్రదిస్తే…అయోధ్యను సందర్శించాలనుకునేవారికి సాయం చేస్తారు.