రియల్ డెవలప్‌మెంట్ : మోదీ వరం – అందుబాటులోకి విశాఖ ఐఐఎం, తిరుపతి ఐఐటీ

ఏపీకి బీజేపీ ఏమీ చేయలేదంటూ జరుగుతున్న ప్రచారానికి మెల్లగా తెరలు తొలగిపోతున్నాయి. నిజమేంటో కళ్ల ముందుకు వస్తోంది. ప్రధాని మోదీ ఈ రోజు విశాఖ ఐఐఎం, తిరుపతి ఐఐటీ లను ప్రారంభిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవాలపై తెలుగు మీడియాలో ఎంత కవరేజీ వస్తుందో కానీ.. ప్రజలకు మాత్రం.. బీజేపీ చేసిన అభివృద్ధిపై స్పష్టత రావడం ఖాయం.

అద్భుతంగా తిరుపతి ఐఐటీ

తిరుపతి ఐఐటీ ని కేంద్రం ఏర్పాటు చేసింది. ఐ 2023-24 ఆర్థిక సంవత్సరానికి దేశంలోని ఐఐటీలు అన్నింటికి కలిపి 9361 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. శరవేగంగా నిర్మాణాలు పూర్తి చేశారు. ఇప్పుడు ఐఐటీ క్యాంపస్ అద్భుతంగా రూపొందిందింది. అనేక మందిని ఆకర్షిస్తోంది. అత్యున్నత ప్రమాణాలతో వేల కోట్లు ఖర్చు పెట్టి ఈ క్యాంపస్ ను సిద్ధం చేశారు. చదలవాడ నగర్‌లోని కృష్ణ తేజ విద్యా సంస్థలలో తాత్కాలిక క్యాంపస్‌లో 5 ఆగస్టు 2015న కళాశాల పనిచేయడం ప్రారంభించింది. IIT తిరుపతి మొదట్లో తిరుపతిలోని చదలవాడ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్‌ల క్యాంపస్‌లో పని చేయగా, రేణిగుంట మరియు శ్రీకాళహస్తి మధ్య ఉన్న ఏర్పేడు సమీపంలో శాశ్వత భవనాలు నిర్మించారు. క్లాస్‌రూమ్ కాంప్లెక్స్, హాస్టల్ బ్లాక్, ఓపెన్ ఎయిర్ థియేటర్, కంప్యూటర్ ల్యాబ్‌లు, అన్ని ట్రేడ్‌ల కోసం ఇంజనీరింగ్ వర్క్‌షాప్‌లు, లైబ్రరీ, 500-సీటర్ మెస్, ప్లే గ్రౌండ్, ఇండోర్ స్టేడియం ఆరోగ్య కేంద్రాలను నిర్మించారు. అత్యున్నత విద్య అందించేలా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. అకడమిక్ జోన్‌లో నిర్మించిన భవనాలలో సుమారు 100 మంది అధ్యాపకులకు కార్యాలయాలు , 50 ప్రయోగశాలలు, సెంట్రల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ (సిఐఎఫ్), లెక్చర్ హాల్ కాంప్లెక్స్ (ఎల్‌హెచ్‌సి), అడ్మినిస్ట్రేటివ్ భవనంతో కూడిన రెండు డిపార్ట్‌మెంట్ భవనాలు ఉన్నాయి. హాస్టల్ జోన్‌లో ఒక్కొక్కటి 500 గదులతో రెండు హాస్టళ్లు, సెంట్రల్ డైనింగ్ సౌకర్యం, క్రీడా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. నీటిని నిల్వ చేయడానికి క్యాంపస్‌లో 10 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో రెండు చెరువులను కూడా ఏర్పాటు చేశారు.

హార్వర్డ్ తరహాలో విశాఖ ఐఐఎం

మోదీ ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన కేంద్ర విద్యా సంస్థల్లో ఐఐఎం ఒకటి. ఆంధ్ర విశ్వ విద్యాలయం పరిధిలో 2015 నుంచి తాత్కాలిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. శాశ్వత భవన నిర్మాణం కోసం ప్రభుత్వం
ఆనందపురం–గంభీరం పరిసర ప్రాంతాల్లో 241.50 ఎకరాలు కేటాయించింది. ప్రస్తుతం ఈ స్థలంలో శాశ్వత భవనాల నిర్మించారు. ప్రపంచ ప్రసిద్ధ హార్వర్డ్ విశ్వవిద్యాలయాన్ని మించేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ నిర్మాణాల్లో మిళితం చేయడం విశేషం. క్యాంపస్ మొత్తానికి సౌర విద్యుత్ వినియోగించుకునేలా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. పగలు వీలైనంత మేరకు సూర్యుని వెలుతురు వినియోగించుకుంటూ.. రాత్రి సౌరవిద్యుత్ వినియోగించేలా నిర్మాణాలు చేపట్టారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం నమూనాను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ‘యు’ ఆకారంలో కూర్చునేలా
తరగతి గదులు నిర్మించారు. 50 మంది, 100 మంది కూర్చునేలా ఏసీ తరగతి గదులు సిద్ధం చేశారు. వందసీట్లతో 10 తరగతి గదులు, 50 సీట్లతో 10 తరగతి గదులు నిర్మించారు. వీటికి అదనంగా మరో 5 తరగతి గదులు కూడా నిర్మించారు. ప్రొఫెసర్లకు 117 గదులున్నాయి. ప్రత్యేక తరగతులు చెప్పేందుకు దేశవిదేశాల నుంచి వచ్చే ప్రముఖుల కోసం 60 గదులతో ఫైవ్ స్టార్
హోటల్ని పోలిన అతిథి గృహం నిర్మాణం కూడా పూర్తయింది. ప్రతి ప్రొఫెసర్ చెప్పే పాఠం రికార్డవుతుంది. ఇలా రికార్డు చేసిన పాఠాలను ఐఐఎం వెబ్ సైట్ లో విద్యార్థుల కోసం రెండువారాలు ఉంచుతున్నారు.

25న మంగళగిరి ఎయిమ్స్ జాతికి అంకితం

మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్ ఆస్పత్రిని మోదీ 25న జాతికి అంకితం చేయనున్నారు. 2018లో రూ.1,618 కోట్లతో పనులు ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలో ఇదే మొదటి ఎయిమ్స్. ఎయిమ్స్‌లో ఇప్పటికే యూజీ కోర్సు నిర్వహిస్తున్నారు. త్వరలో పీజీ కోర్సును ప్రారంభించనున్నారు. AIIMS-M అధునాతన రోబోటిక్ ఫిజియోథెరపీ, నడక విశ్లేషణ సలహాలు మరియు ఉపశమన సంరక్షణ మరియు టెలిమెడిసిన్ సేవలను కూడా అందిస్తోంది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM)లో భాగంగా 35,000 మంది రోగుల రికార్డులను సృష్టించడం AIIMS-M యొక్క గణనీయమైన విజయం. ఎక్కువ మంది రోగులు తమను తాము నమోదు చేసుకుంటున్నందున డేటాబేస్ పెరుగుతోంది. IIT-మద్రాస్ , SRM విశ్వవిద్యాలయం సహకారంతో కొన్ని R&D కార్యక్రమాలు ను కూడా ప్రారంభించారు. ట్రామా మరియు అత్యవసర సేవలు 24 గంటల్లో అందుబాటులో ఉన్నాయి . ప్రస్తుతం ఐపీ బెడ్ స్ట్రెంగ్త్ 555 ఉండగా వాటిని 950కి పెంచే ప్రక్రియ ప్రారంభమైంది.

ఏపీ కోసం కేంద్రం చేసిన వాటిలో ఇవి ఒక శాతమే. వేల కోట్ల నిధులతో అభివృద్ధి పనులను కేటాయించింది. కానీ ప్రాంతీయ పార్టీలు మాత్రమే.. ఏపీపై దుష్ప్రచారం చేస్తూనే ఉన్నాయి.