బీజేపీ వైపు రాజస్థాన్ కాంగ్రెస్ నేతల చూపు..

ప్రధాని మోదీ ఒక్క సమ్మోహన నాయకుడు. ఒక్క సారి ఆయనపై దృష్టి పడిందంటే..బీజేపీలో చేరిపోయి, మోదీతో కలిసి దేశాన్ని అభివృద్ధి చేయాలన్న కోరిక కలుగుతుంది. ఎంతటి ప్రత్యర్థి అయినా సరే దేశానికి మోదీ సేవలను ప్రశంసించకుండా ఉండలేరు. అప్రయత్నంగానే ఆర్టికల్ 370, ముమ్మారు తలాఖ్ రద్దు, అయోధ్య రామాలయ అంశాలను ప్రస్తావించి మోదీని ప్రశంసిస్తారు. ఈ క్రమంలో ఇప్పుడు పలువురు నేతలు బీజేపీలో చేరి మోదీ నాయకత్వాన్ని స్వీకరించేందుకు సిద్ధమవుతున్నారు….

కమలతీర్థం పుచ్చుకున్న మహేంద్రజీత్

మహేంద్రజీత్ సింగ్ మాలవీయ.. నాలుగు సార్లు రాజస్థాన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే. మంత్రిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ తప్పొప్పులు బాగా తెలిసిన నాయకుడు కూడా ఆయనే. ఇప్పుడు కాంగ్రెస్ తో విసుగుచెంది ఆయన బీజేపీలో చేరిపోయారు. ప్రధాని మోదీ ఆర్థిక, సామాజిక విధానాలతో ఆకర్షితుడినై వచ్చానని మాలవీయ చెబుతున్నారు. ఢిల్లీలో, రాజస్థాన్లో డబుల్ ఇంజన్ సర్కారు కారణంగా అభివృద్ధి వేగంగా పరుగులు తూస్తోందని మహేంద్రజీత్ సింగ్ మాలవీయ అంటున్నారు.

కాంగ్రెస్ హయాంలో ఆదివాసీలకు అన్యాయం..

రాజస్థాన్లో ఐదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆదివాసీ, గిరిజనులకు ప్రయోజనం జరగకపోగా అన్యాయం చేశారని మాలవీయ ఆరోపించారు. దేశం మొత్తం కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఆ పార్టీ లేచి నిలబడటం కుదరని పని అని విశ్లేషించారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓటి శబ్దాలు, ఒట్టి శబ్దాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తన విధానాల నుంచి పక్కకు జరిగి కొంతమంది కోసమే పనిచేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.ఆదివాసీ మహిళకు రాష్ట్రపతి పదవి ఇవ్వడం ద్వారా ప్రధాని మోదీ.. సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇచ్చారని బీజేపీ రాజస్థాన్ అధ్యక్షుడు సీపీ జోషి అన్నారు.

క్యూలో చాలా మంది నేతలు

మహేంద్రజీత్ సింగ్ మాలవీయ చేరికతో ఒక బలమైన గిరిజన నాయకుడు బీజేపీ వైపుకు వచ్చినట్లయ్యింది. ఆయన తొలి సారి 2008లో ఎన్నికల విజయాన్ని రుచిచూశారు.అప్పట్లో జేడీయూ అభ్యర్థి జీత్మల్ కాంత్ పై బాగీడోరా నియోజకవర్గంలో 45 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారుత. 2013లో కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు ఉన్నప్పుడు సైతం అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2018లో కూడా పాత అభ్యర్థి ఖేమ్ రాజ్ గరాసియాపై గెలుపొందారు. ఈ సారి కూడా కంఫర్టబుల్ మెజార్టీలో విజయం సాధించిన మాలవీయ…దేశ, రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను అర్థం చేసుకున్నారు. ఇకపై ప్రజా సేవ బీజేపీతోనే సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. రాజస్థాన్ కాంగ్రెస్ లో 15 నుంచి 20 మంది సీనియర్ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. ఒక్క సారి పచ్చజెండా ఊపితే వచ్చి చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. వాళ్లను చేర్చుకోవడం ద్వారా లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మరింత పటిష్టంగా ముందుకు వెళ్తుందని భావిస్తున్నారు…