ఆమంచికి షాకిచ్చిన సీఎం జగన్ – ఇక టిక్కెట్ లేనట్లేనా ?

చీరాలలో ఇండిపెండెంట్ గా కూడా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ కు ఈ సారి ఎక్కడ పోటీ చేయాలో కూడా తెలియడం లేదు. గతంలో టీడీపీలో ఉండే ఆయన ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిపోయారు. ఆ పార్టీ తరపు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినా వైసీపీ అధికారంలోకి వచ్చింది కదా అని ఆయన సంతోషంగా ఉండలేకపోయారు. ఇప్పుడు పర్చూరుకు వేరే అభ్యర్థిని ఇంచార్జ్ గా నియమించడంతో ఆమంచికి నిలువ నీడ లేకుండా పోయినట్లయింది.

కరణం వైసీపీలో చేరికతో ఆమంచికి కష్టాలు

టీడీపీ నుంచి గెలిచిన కరణం బలరాం వైసీపీలో చేరడంతో ఆమంచికి కష్టాలు ప్రారంభమయ్యాయి. నియోజకవర్గంలో జోక్యం చేసుకోవద్దని ఆమంచికి చెప్పి.. .. పర్చూరుకు పంపారు. అయితే ఆమంచి దృష్టి అంతా చీరాలపైనే ఉంది. వైసీపీ టిక్కెట్ ఇస్తే ఇచ్చింది లేకపోతే లేదు.. తాను మాత్రం చీరాలలోనే పోటీ చేయాలని డిసైడయ్యారు. జనసేన పార్టీలో అయినా చేరి పోటీ చేయాలనుకుంటున్నారు. ఆయన సోదరుడ్ని చాలా రోజుల కిందటే జనసేనలోకి పంపారు. ఈ రాజకీయ వ్యూహమే జగన్ కోపం తెప్పించిందంటున్నారు.

మాజీ చీరాల నేతకు పర్చూరు బాధ్యతలిచ్చిన సీఎం జనగ్

పర్చూరుకు కూడా ఆమంచి ఇంచార్జిత్వాన్ని సీఎం జగన్ పక్కన పెట్టా.రు . యడం బాలాజీ అనే నేతకు చాన్సిచ్చారు. ఆమంచి చీరాలలో ఇండిపెండెంట్ గా గెలిచినప్పుడు వైసీపీ అభ్యర్థి ఈయనే. ఇప్పుడు ఆమంచి ఏం చేయబోతున్నారన్నది వైసీపీ వర్గాల్లోనూ ఆసక్తి కరంగా మారింది. ఆయన పార్టీ మారినా.. ఇండిపెండెంట్ గా పోటీ చేసినా వైసీపీకి తీవ్ర నష్టం జరగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే వైసీపీకి నష్టం చేసినా ఆయన గెలుస్తారన్న నమ్మకం మాత్రం లేదు.

పద్దతి లేని రాజకీయంతో నష్టపోయిన ఆమంచి

రోశయ్య శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆమంచి.. పద్దతి లేని రాజకీయాలు చేయడంతోనే సమస్య వచ్చింది. పర్చూరుకు వెళ్లి … అక్కడి సీరియస్ గా పని చేసుకుని ఉంటే సమస్య ఉండేది కాదని పదే పదే చీరాలలో వేలు పెట్టి మొదటికే మోసం తెచ్చుకున్నారని అంటున్నారు. ఈ క్రమంలో ఆయన రాజకీయ భవిష్యత్ అంధకారంలో పడిపోయిందన్న వాదన వినిపిస్తోంది.