సీజన్ మారుతున్నప్పుడు చిన్న చిన్న అనారోగ్యాలు సహజమే. ముఖ్యంగా జలుబు, గొంతునొప్పి చాలా ఇబ్బంది పెడతాయి. అయితే గొంతు నొప్పి రాగానే మందులు వేసేసుకుంటారు. అయితే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు గొంతు నొప్పి ఇట్టే మాయమైపోతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు..
వేడి నీటిలో ఉప్పు వేసి పుక్కిలించాలి
గోరు వెచ్చటి నీటిలో ఉప్పువేసి ఆ నీటిని రోజుకి మూడు నాలుగు సార్లు పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. గోరువెచ్చని నీళ్లలో ఉప్పువేసి పుక్కిలిస్తే.. శ్లేష్మం విచ్ఛిన్నం అవుతుంది. ఇది గొంతులోని బ్యాక్టీరియాను చంపుతుంది. గొంతునొప్పి త్వరగా నయం అవుతుంది. రాళ్ల ఉప్పు వాడితే ఇంకా మంచిది.
తేనె – నిమ్మకాయ – అల్లం రసం
తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. నిమ్మరసంలో నెయ్యి కలిపి తాగితే గొంతు నొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. తేనెలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు గొంతునొప్పిని శాంతపరుస్తాయి. ఒక చెంచా అల్లం రసం, ఒక చెంచా తేనె బాగా కలిపి తీసుకుంటే.. గొంతు నొప్పి త్వరగా నయమవుతుంది. తేనె శ్వాసనాళాలలో పేరుకున్న శ్లేష్మాన్ని కరిగిస్తుంది.
ఆవిరి
గొంతు నొప్పి నుంచి ఆవిరి మంచి ఉపశమనం. ఓ గిన్నెలో నీటిని మరిగించి అందులో పసుపు, యూకలిప్టస్ ఆయిల్ లేదంటే ఏదైనా బామ్ మిక్స్ చేసి ఆవిరి పడితే త్వరగా ఉపశమనం లభిస్తుంది.
హెర్బల్ టీ
చామంతి, పిప్పరమెంటు, అల్లం వంటి కొన్ని హెర్బల్ టీలు గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. హెర్బల్ టీని తరచూ తాగడం వల్ల చాలా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఉప్పు నీళ్లు – బేకింగ్ సోడా
ఉప్పు నీళ్లలో, బేకింగ్ సోడా వేసి పుక్కిలిస్తే.. గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. బేకింగ్ సొడా బ్యాక్టీరియాను చంపుతుంది, ఈస్ట్, కఫాన్ని పెరుగుదలను నిరోధిస్తుంది. ఒక కప్పు గోరువెచ్చని నీటీలో, 1/4 టీస్పూన్ బేకింగ్ సోడా, 2 చిటికెల ఉప్పు వేసి పుక్కిలించండి. గొంతు నొప్పి నుంచి త్వరగా రిలీఫ్ లభిస్తుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.