ప్రజలకు అందుబాటులో ఉండేందుకు బీజేపీ ఎప్పటికప్పుడు కొత్త పద్దతుల్లో ప్రయత్నిస్తూనే ఉంది. గతంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు పెట్టారు. ఈ సారి పల్లె ప ల్లెకు బీజేపీ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏపీలో 21 వేల గ్రామాల్లో బీజేపీ నేతలు, కార్యకర్తల పర్యటనలు చేస్తారు. ప్రజలతో మాట్లాడి సమస్యలు, ఇబ్బందులు తెలుసుకుంటారు. కేంద్ర పార్టీకి నివేదిక ఇస్తారు.
బీజేపీకి సంస్థాగతంగా బలోపేతం చేయాలని కేంద్ర పార్టీ ఆదేశం
బిజెపి సంస్థా గతంగా బలోపేతం చేయాలని కేంద్ర పార్టీ నేతల నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో ఏపీ బీజేపీ నేతలు కార్యాచరణ ప్రారంభించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా బీజేపీ ప్రత్యేక కార్యక్రమాలు చేబపడుతోంది. అందులో అంతర్భాగంగా గాంవ్ ఛలో అభియాన్ పేరుతో దేశంలో ఉన్న ఏడున్నర లక్షల పల్లెల్లో బీజేపీ నేతలు పర్యటిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారు చెప్పింది వింటున్నారు వారి సమస్యలను రికార్డు చేసుకుంటున్నారు. అదే తరహాలో ఏపీలోనూ పల్లెకు పోదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఎన్నికలకు ప్రిపరేషన్ కూడా !
రెండు మూడు నెలల్లో ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో సంస్థాగతంగా, రాజకీయంగా కూడా బిజెపి అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఎపిలో ప్రతి పల్లె ను బీజేపీ నేతలు కార్యకర్తలు సందర్శిస్తారు. పల్లెకు పోదాం లో భాగంగా ఎపిలో ఉన్న 21 వేల గ్రామాల్లో నేటి సాయంత్రం నుండి 24 గంటల పాటు అక్కడ బిజెపి నాయకులు, కార్యకర్తలు ఉంటారు. అక్కడ స్థితిగతులు తెలుసుకుంటూ అక్కడ పరిస్థితులను అంచనా వేస్తారు. ప్రజల సమస్యలు, ఇబ్బందులు తెలుసుకుని రాష్ట్ర నాయకత్వానికి అందజేస్తారు. ఈ అంశాలన్నిటిని జాతీయ నాయకత్వానికి నివేదిక రూపంలో ఇవ్వనున్నారు.
అందర్నీ ప్రిపేర్ చేశారా ?
బిజెపి నాయకులు , కార్యకర్తలు అందరూ గ్రామాలకు వెళ్తున్నారvf.. ల్లె ప్రజల పాట్లు తెలుసుకుని పరిష్కారం దిశగా ఆలోచన చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం కోరుతోంది.. పార్టీ నేతలందర్నీ ఇందులో భాగస్వాముల్ని చేస్తున్నారా లేదా అన్నదానిపై మాత్రం సందేహాలు ఉన్నాయి. అన్ని స్థాయిల్లో నేతల్ని కలుపుకుని వెళ్తేనే ఇలాంటి కార్యక్రమాలు విజయవంతమవుతాయని లేకపోతే.. మీడియాలో ప్రచారానికే పరిమితమవుతాయని క్యాడర్ అంటోంది.