పవన్ టిక్కెట్లను అమ్ముకుంటున్నారా ? – ఆ చెక్కుల రిటర్న్స్ వెనుక అసలేం జరిగింది ?

పార్టీకి విరాళాలు ఇచ్చి టిక్కెట్లు అడుగుతున్న వారిని పవన్ దూరం పెట్టారని జనసేన వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.. కానీ అసలు నిజం వేరే ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. టీడీపీతో పొత్తు తో వచ్చే స్థానాలను ఆయన ఆర్థికంగా బలవంతులైన నేతలు.. పార్టీకి విరాళిచ్చే వారికి కేటాయిస్తున్నారని.. ఒకరి తర్వాత ఒకరు ఎక్కువ ఇస్తామంటే.. ముందుగా చెక్కులు ఇచ్చిన వారికి రిటర్న్ పంపేస్తున్నారన్న ఆరోపణలు బయట నుంచి వస్తున్నాయి.

ఏడుగురికి చెక్కులు ఇచ్చేశామన్న జనసేన నేతలు

ఇటీవల కొంతమంది ప్రముఖులు జనసేనకు విరాళం ఇస్తున్నామని చెప్పి చెక్కులు ఇచ్చారు. ఆ తర్వాత వారు పలానా సీటు కావాలని డిమాండ్ చేశారని.. . దీంతో జనసేనాని పవన్ కల్యాణ్ కు కోపం వచ్చింది. అడగకపోయినా జనసేనకు విరాళం పేరుతో చెక్కులు ఇచ్చి, ఇప్పుడు సీట్లు అడగటం ఏంటని.. ఆశావహులపై సీరియస్ అయ్యారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. పవన్ ఆదేశాలతో 7 చెక్కులను వెనక్కిపంపేశారు జనసేన నాయకులు. పార్టీకి విరాళం పేరుతో వారు ఇచ్చిన డబ్బుల చెక్ ను తిరిగి వారికే పంపేశామని మీడియాకు సమాచారం ఇచ్చారు.

చెక్కులిచ్చినప్పుడు సీటు అడుగుతారని తెలియదా ?

జనసేన టిక్కెట్ల కోసం గతంలోనే పలువురు ప్రయత్నాలు చేశారు. వారందరికీ.. విరాళం ఇవ్వలన్న ఓ అప్రకటిత షరతును పవన్ పెట్టినట్లుగా తెలుస్తోంది ఇటీవల పొత్తుతో.. వంద శాతం గెలిచే స్థానాలే తీసుకుంటామని చెప్పడంతో.. బలమైన స్థానాలు వస్తాయన్న ఆశతో.. ఇతరులు అంతకు ముందు ఇచ్చిన వారి కన్నా.. ఎక్కువ ఇస్తామని ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ముదంు చెక్కులు ఇచ్చిన వారివి వెనక్కి పంపుతున్నారని అంటున్నారు. ఇక నుంచి స్వచ్చందంగా ఇచ్చే విరాళాలు మాత్రమే తీసుకుంటామని.. ఇకపై చెక్కులు తీసుకోమని.. కూడా ఓ ప్రకటన చేశారు. అంటే.. ఇక అభ్యర్థులు ఫుల్ అయిపోయారన్న సంకేతాలేనని జనసైనికులు కూడా సెటైర్లు వేసుకుంటున్నారు.

సీట్ల సర్దుబాటుపై కొలిక్కి రాని చర్చలు

చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య సీట్ల సర్దుబాటుపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. అభ్యర్థుల ఎంపికపైనా కసరత్తు చేస్తున్నారు. జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు? ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అభ్యర్థులు ఎవరు? అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. . ఆ తర్వాతే… జనసేనలో మరింత మంది బాగా డబ్బున్న నేతలు చేరే అవకాశం కనిపిస్తోది.