గుంటూరు టీడీపీలో పెమ్మసాని చిచ్చు – ఎంపీ టిక్కెట్ ఎన్నారైకి అమ్ముకున్నారా ?

పెమ్మసాని చంద్రశేఖర్. కొద్ది రోజులుగా ‘ టీడీపీఈ పేరు పెద్ద చిచ్చు పెట్టింది. ఆయనకు గుంటూరు లోక్ సభ టిక్కెట్ ఇస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఐదేళ్లు ప్రభుత్వంపై పోరాడిన వారికి కాకుండా డబ్బు మూటలతో వచ్చే వారికి చంద్రబాబు టిక్కెట్ అమ్ముకంటున్నారని సొంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి.

సౌండ్ పార్టీ పెమ్మసానికి గుంటూరు ఎంపీ టిక్కెట్

గుంటూరు లోక్ సభ అభ్యర్థిగా ఎన్నారై పెమ్మసాని చంద్రశేఖర్ పేరును దాదాపుఘా ఖరారు చేశారు. ఎవరీ చంద్రశేఖర్ అంటే బాగా డబ్బున్న ఎన్నారై. అదొక్కటే అర్హత. పెమ్మసాని రాత్రికి రాత్రి దిగిపోయారని కొంత మంది గుర్రుగా ఉన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికే చాన్సివ్వాలని కోరుతున్నారు. కానీ పెమ్మసాని అమెరికా బాగా సంపాదించిన వ్యక్తి. ఎంత కావాలంటే అంత పెడతామన్నట్లుగా ఆఫర్ ఇవ్వడంతో చంద్రబాబు ఆయన వైపే మొగ్గు చూపుతున్నారని అంటున్నారు.

2019లో పోటీకి వచ్చి చాన్స్ రాకపోవడంతో జంప్

పెమ్మసాని చంద్రశేఖర్ గతంలో కోడెల శివప్రసాదరావు ద్వారా టిక్కెట్ కోసం ప్రయత్నించారు. కోడెల శివప్రసాదరావే సిఫారసు చేయడంతో 2019లో చంద్రబాబు నర్సరావుపేట ఎంపీ సీటును ఆయనకు కేటాయిచాలని అనుకున్నారు. దీంతో ఆయన అప్పట్లో నర్సరావుపేటలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. ాకనీ రాజకీయ సమీకరణాలతో చంద్రబాబు సీటు రాయపాటి కుటుంబానికి ఇచ్చారు. ఇప్పుడు గుంటూరు నుంచి అవకాశం కల్పించాలని అనుకుంటున్నారు. పార్టీని ఆర్థికంగా ఆదుకుంటారన్న హామీతో ట
ిక్కెట్ ఇస్తున్నట్లుగా చెబుతున్నారు.

పెమ్మసానికి టిక్కెట్ ఇస్తే గుంటూరు టీడీపీలో చీలిక ఖాయం

గుంటూరు ఎంపీ టిక్కెట్ ను పెమ్మసానికి ఇస్తే ఊరుకునేది లేదని ఇప్పటికే చాలా మంది నేతలు హైకమాండ్ కు హెచ్చరికలు జారీ చేశారు. అయితే చంద్రబాబు మాత్రం తాను అనుకున్నదే చేస్తారు. ఆర్థిక పరమైన సమస్యలకు పరిష్కారం చూపిస్తారు కాబట్టి ఆయనకే టిక్కెట్ ఇస్తారు. అందుకే.. గంటూరు టీడీపీలో చీలిక ఖాయమన్న ప్రచారం జరుగుతోంది.